Begin typing your search above and press return to search.
యుద్దం : మోడీ కి పాకిస్తానీ మహిళ కృతజ్ఞతలు
By: Tupaki Desk | 10 March 2022 1:30 AM GMTఉక్రెయిన్ పై రష్యా ప్రకటించిన యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఒకటి రెండు రోజుల్లో ముగుస్తుంది అనుకున్న యుద్ధం రెండు వారాలు అయినా కూడా సాగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలకు చెందిన వారంతా వారి వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వైద్య విద్య కోసం వెళ్లిన భారత విద్యార్థులను మరియు ఇతర పనులపై.. వ్యవహారాలపై వెళ్ళిన ఇండియన్స్ ను వెనక్కి తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది.
భారతీయులను వెనక్కి తీసుకు వచ్చేందుకు గాను రష్యా యుద్ధ విమానాలను కొన్ని గంటల పాటు ఆపించి యుద్ధ విరామం ను ప్రకటింప చేసింది మోడీ వైపు ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా వైపు చూశాయి. ఈ సమయం లో ఒక పాకిస్థాన్ మహిళా తాను ఉక్రెయిన్ నుండి ప్రాణాలతో బయట పడటానికి కారణమైన భారత అధికారులకు మరియు ప్రధాని నరేంద్ర మోడీ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
ఉక్రెయిన్ లో అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాను.. వర్షం వస్తున్న సమయంలో తాను గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నానని ఆ సమయంలో భారత అధికారులు తనను ఉక్రెయిన్ సరిహద్దుకు తరలించారని ఆమె చెప్పుకొచ్చింది. సరిహద్దుల నుండి తాను స్వస్థలం కు చేరుకున్నట్లుగా ఆమె పేర్కొంది. ఇండియాకు చెందిన అధికారుల సహాయం వల్లే తాను అక్కడి నుండి బయటపడ్డాను అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆపరేషన్ గంగా లో భాగంగా ఉక్రెయిన్ లో ఉన్న దాదాపు అందరు ఇండియన్స్ ని కూడా వెనక్కి తీసుకు రావడంలో కేంద్ర ప్రభుత్వం సఫలమైందని బీజేపీ నాయకులు ప్రకటించారు. ఈ సమయంలో కొన్ని ఇతర దేశాలకు చెందిన ప్రజలు కూడా భారత జెండా పట్టుకొని దేశ సరిహద్దులకు చేరుకున్నారు.
భారత జెండా ఉన్న వారిని రష్యా మరియు ఉక్రెయిన్ దేశాలకు చెందిన సైనికులు వదిలి పెట్టారు. మోడీతో చేసుకున్న ఒప్పందం నేపథ్యంలో రెండు దేశాలు కూడా భారత ప్రజలను తరలించేందుకు సహకరించాయి. ఈ క్రమంలో వివిధ దేశాలకు చెందిన ప్రజలు వారి వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు భారత జెండా పట్టుకుని సరిహద్దులకు చేరుకున్నారు.

ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసి వారు తమ ఆనందం వ్యక్తం చేశారు. తాజాగా ఈ పాకిస్తాన్ మహిళ చేసిన వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోడీ పై మరియు అధికారులపై గౌరవాన్ని పెంచే విధంగా ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.