Begin typing your search above and press return to search.

పాక్‌ తో యుద్ధంపై స్వామి అలర్ట్స్!

By:  Tupaki Desk   |   7 Nov 2016 7:00 AM GMT
పాక్‌ తో యుద్ధంపై స్వామి అలర్ట్స్!
X
సరిహద్దుల్లో తాజా పరిస్థితుల నేపథ్యంలోనూ, మరోపక్క పాకిస్థాన్ లో పాలన సైన్యం చేతుల్లోకి వెల్లబోతుందనే కథనాలు వస్తోన్న తరుణంలోనూ... ఇక పాక్ తో భారత్ కు యుద్దం తప్పదా? త్వరలో ఈ మేరకు భారత్ - పాక్ ల మధ్య భారీ యుద్ధం జరగబోతుందా? అంటే అవుననే అంటున్నారు బీజేపీ నేత. సంచలన వ్యాఖ్యలకు పేరెన్నికగన్న నేతల్లో ఒకరైన బీజేపీ సీనియర్‌ నేత సుబ్రమణ్య స్వామి మరోసారి తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చివేసిన అనంతరం పాలనను సైన్యం తమ చేతుల్లోకి తీసుకుంటుందని స్వామి అభిప్రాయపడ్డారు.

అలాగే, పాకిస్థాన్‌ సైన్యం సరిహద్దుల వద్ద నిరంతరం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని, దీన్నిబట్టి ఆ చర్యలను యుద్ధం తప్పదనే సంకేతాలుగా భావించాలని, కాబట్టి పాక్‌ తో యుద్ధానికి మనం సన్నద్ధంగా ఉండాలని స్వామి చెబుతున్నారు.

కాగా, ఉడీ ఉగ్రదాడి అనంతరం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే) లోని ఉగ‍్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్‌ దాడులు చేసిన తర్వాత ఇప్పటివరకూ సుమారు 100 సార్లు పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ క్రమంలో సరిహద్దు గ్రామాలను సైతం ఖాలీ చేయించిన భారత సైన్యం నిత్యం కాల్పులు జరుపుతున్న పాక్‌ కు దీటైన జవాబిస్తూనే ఉంది. ఈ క్రమంలో నాటినుంచీ ఏదో ఒక చోట సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక‍్త పరిస్థితులు కొనసాగుతుండటం, ఇరు వైపులా ప్రాణ నష్టం జరుగుతుండటం తెలిసిందే.

ఈ క్రమంలో పాక్ పై మరోసారి తేరుకోలేని విదంగా భారత సనియం సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని ప్రధాని అభిప్రాయపడుతున్నారని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే! అయితే, తాజాగా సుబ్రమణ్య స్వామి ఇలాంటి ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/