Begin typing your search above and press return to search.
పాక్ ఆర్మీ చీఫ్ సంచలనం.. భారత్ తో యుద్ధాన్ని కోరుకోవట్లేదు
By: Tupaki Desk | 3 Feb 2021 4:30 PM GMTసంచలన ప్రకటన చేసింది దాయాది. వేయేళ్లు అయినా భారత్ తో యుద్ధం చేస్తామని.. దరిద్రపుగొట్ట శపధాలు చేసి.. తమ దేశాన్ని సర్వనాశనం చేసుకున్న పాకిస్తాన్ కు ఇప్పుడిప్పుడే తెలివి వచ్చిందా? అన్న సందేహానికి తావిచ్చేలా సంచలన ప్రకటన చేశారు పాక్ ఆర్మీ చీఫ్ జావేద్ బాజ్వా. నిత్యం కారాలు..మిరాయాలు నూరుతూ సరిహద్దుల్లో అశాంతికి ఆజ్యం పోస్తూ దేశాన్ని పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో పడేసిన పాలకులకు రాని బుద్ది.. వారిని ప్రభావితం చేసే ఆర్మీ చీఫ్ కు ఎందుకు వచ్చిందన్నది ఇప్పుడున్న పెద్ద ప్రశ్న.
శాంతి వచనాల్ని వల్లిస్తున్న ఆయన.. తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. శాంతియుతంగా ఇరుదేశాలు కలిసి సాగాలన్నదే తమ అభిమతంగా ఆయన పేర్కొన్నారు. తాజాగా పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఒక కార్యక్రమం రావల్పిండిలో జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన బాజ్వా మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలకు శాంతి హస్తాన్ని చాచాల్సిన సందర్భం ఆసన్నమైందన్నారు.
తాను చేసిన ప్రకటనను పాక్ బలహీనతగా ఎవరూ భావించొద్దన్న ఆయన.. తన ప్రకటనకు పెడార్థాలు తీయొద్దాన్నారు. ఎవరూ యుద్ధాన్ని కోరుకోవటం లేదని.. డెవలప్ మెంట్ ను కోరుకుంటున్నారన్నారు. కశ్మీర్ అంశాన్ని ఇరు దేశాలు శాంతియుతంగా పరిష్కరించుకుంటే బాగుంటుందన్న ఆయన.. పరస్పర గౌరవానికి తాము అత్యధిక ప్రాధాన్యాన్ని ఇస్తానన్నారు. ఇదే ఆదర్శానికి తాము కట్టుబడి ఉంటామని.. ప్రపంచ దేశాకలు స్నేహహస్తాన్ని చాటాల్సిన సందర్భం వచ్చిందన్నారు. ఉన్నట్లుండి పార్ ఆర్మీ చీఫ్ నోటి వెంట కొత్తతరహా మాట వెనుక అసలు అర్థం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.