Begin typing your search above and press return to search.

సొంత ప్రజల్నిఎంత దారుణంగా చంపిందంటే..

By:  Tupaki Desk   |   3 Jan 2017 4:19 PM GMT
సొంత ప్రజల్నిఎంత దారుణంగా చంపిందంటే..
X
దాయాది దుర్మార్గం ప్రపంచానికి తెలిసి వచ్చింది. సొంత ప్రజలన్న స్పృహ లేకుండా.. తనపై పోరాటం చేస్తున్నారన్న దుగ్థతో ప్రదర్శించిన కాఠిన్యం ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. పాక్ అమానుష చర్యలు ప్రపంచానికి అర్థమయ్యేలా చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు షాకింగ్ గా మారటమే కాదు.. సొంత ప్రజల్ని అంత దారుణంగా చంపేస్తారా? అంటూ అవాక్కు అయ్యే పరిస్థితి.

మానవత్వం అన్నది అస్సలు లేదన్నట్లుగా.. పాక్ మిలటరీ సృష్టించిన దుర్మార్గం చూస్తే.. మనిషి అన్నోడు రోదించాల్సిందే. రెండు రోజుల క్రితం బలూచిస్థాన్ లోని బోలన్ జిల్లాలో పాక్ మిలటరీ సృష్టించిన నరమేధం అత్యంత అనాగరికమైనదిగా అభివర్ణిస్తున్నారు. తుపాకులతో గ్రామాలపై విరుచుకుపడిన పాక్ ఆర్మీ దెబ్బకు.. ఇళ్లను వదిలేసి బలూచిస్థాన్ ప్రజలు పరుగులు తీస్తుంటే.. పైనుంచి పాక్ హెలికాఫ్టర్లు బాంబులు వేయటంతో.. ఊళ్లకు ఊళ్లు శవాల దిబ్బలుగా మారిపోయినట్లు చెబుతున్నారు.

చాలా గ్రామాల్లో ఇల్లు అన్నది లేకుండా ఊళ్లను ఊళ్లను నేలమట్టం చేసినట్లుగా తెలుస్తోంది. అయిన వాళ్ల దారుణ పరిస్థితిని చూసి ఏడ్చేందుకు సైతం అవకాశం లేకుండా.. గ్రామాలకు చెందిన ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా చంపేసినట్లుగా చెబుతున్నారు. ఈ దుర్మార్గ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ప్రపంచానికి షాకింగ్ గా మారింది. రెండు రోజుల క్రితం బలూచిస్థాన్ లో పాకిస్థాన్ నరమేథం సృష్టించిందన్నది నిజమేనని బలూచిస్థాన్ మానవహక్కుల నేతలు స్పష్టం చేస్తున్నారు. సొంత ప్రజలుగా చెప్పుకుంటున్న వారిపై ఇంత అమానవీయంగా.. పాశవికంగా చంపేయటం దుర్మార్గానికే దుర్మార్గంగా చెప్పక తప్పదు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/