Begin typing your search above and press return to search.
ఆదివారం.. నరాలు తెగే ఉత్కంఠే
By: Tupaki Desk | 17 Jun 2017 1:03 PM GMTఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరగనున్న ఇండియా-పాక్ మ్యాచ్ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. లీగ్ మ్యాచ్ లో పాక్ పై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ కు అనూహ్యంగా ఫైనల్ కు చేరిన దాయాది జట్టు ఏ మాత్రం పోటీ ఇస్తుందో వేచి చూడాలి. ఫైనల్ కు ముందు ఇరు జట్ల కెప్టెన్ల గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
2006 లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ను పాకిస్థాన్ ఓడించి కప్ ను కైవసం చేసుకుంది. ఆ జట్టుకు
ప్రస్తుత పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ నాయకత్వం వహించడం విశేషం. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకపై సర్ఫరాజ్ అద్భుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.
2008లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ ను భారత్ గెలుచుకుంది. ఆ జట్టుకు ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వం వహించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ అద్భుతమైన ఫామ్ లో ఉండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం.
అంచనాలకు తగ్గట్టు రాణించిన టీమిండియా అనుకున్నట్లుగానే ఫైనల్ కు చేరుకుంది. అంచనాలు లేకపోయినా పాక్ తన ఆటతీరుతో సౌత్ ఆఫ్రికా - శ్రీలంక - ఇంగ్లండ్ లను ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లింది. ఫైనల్ పోరులో భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. ఏ సమయంలో ఎలా ఆడతారో తెలియని జట్టుగా పాకిస్థాన్ కు పేరుంది. అందుకే ఆ జట్టును డార్క్ హార్స్ అంటారు. లీగ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ భావిస్తూ ఉండవచ్చు. టైటిల్ ఫైట్ లో ఏ అండర్-19 కెప్టెన్ గెలుస్తాడో వేచి చూడాలి. ఏదేమైనా ఆదివారం మ్యాచ్ లో నరాలు తెగే ఉత్కంఠభరిత క్షణాలుండడం ఖాయం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/