Begin typing your search above and press return to search.
రాజస్థాన్‌లో పాక్ గూఢచారి అరెస్ట్..పాక్ ఐఎస్ ఐ తో కలిసి దేశద్రోహం!
By: Tupaki Desk | 11 Jan 2021 5:46 AM GMTడబ్బు కోసం దేశద్రోహానికి పాల్పడిన భారతీయుడిని రాజస్థాన్ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. జైసల్మేర్ జిల్లా లతీ గ్రామానికి చెందిన చెందిన సత్యనారాయణ్ పలివాల్పా కిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తుండగా పక్కా ఆధారాలతో అరెస్టు చేశామని జైపూర్ పోలీసులు తెలిపారు. భారత సైన్యం, పోలీసుల సమాచారాన్ని సత్యనారాయణ్ పాకిస్థాన్ కు చేరసినట్లు తమ విచారణలో వెల్లడైందని వెల్లడించారు.
భారత మిలటరీ సమాచారాన్ని పాక్ ఐఎస్ ఐ ఏజెంటుకు పంపించానని నిందితుడు సత్యనారాయణ్ అంగీకరించాడని అధికారులు తెలిపారు. పాక్ ఐఎస్ ఐ ఏజెంటుతో సత్యనారాయణ్ కు సంబంధాలున్నాయని, ఆయన దేశ సైనికులకు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాక్ ఐఎస్ ఐ ఏజెంటుకు అందించాడని సీఐడీ పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఫోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ వద్ద మూడు రోజుల క్రితం అనుమానాస్పదంగా సంచరిస్తున్న సత్యనారాయణ్ ను నిఘా సంస్థలు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. రెండ్రోజుల విచారణ అనంతరం అతడు పాక్ కి గూఢచారిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. సరిహద్దుల్లో భారత సైన్యం కదలికలు, ఫోఖ్రాన్ వద్ద సైన్యం చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని అతడు సోషల్ మీడియా ద్వారా ఐఎస్ ఐ కి చేరవేసినట్లు తెలుస్తోంది. సత్యనారాయణ్ ని హనీట్రాప్ ద్వారా పాక్ సైన్యం వలలో వేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. అఫీషియల్ సీక్రెట్ యాక్ట్, 1923 కింద అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనట్లు ఇంటెలిజెన్స్ ఏడీజీ ఉమేష్ మిశ్రా తెలిపారు.