Begin typing your search above and press return to search.
పాకిస్తాన్ దగ్గరున్న బాంబు సైజు చెప్పి ఆ దేశ మంత్రి
By: Tupaki Desk | 3 Sep 2019 7:19 AM GMTకశ్మీర్ ఎపిసోడ్ తర్వాత భారత్- పాక్ మధ్యన సంబంధాలు దారుణంగా దెబ్బ తిన్న విషయం తెలిసిందే. కశ్మీర్ అంశంలో అదే పనిగా వేలెడుతున్న పాకిస్తాన్ కు మరో అవకాశం ఇవ్వకుండా చేసిన మోడీ సర్కారుపై ఇమ్రాన్ ప్రభుత్వం కుతకుతలాడిపోతోంది. భారత్ తో సంబంధాల్ని పూర్తిగా తెంచుకున్నట్లు ప్రకటించటంతో పాటు.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది.
ఓవైపు అణుయుద్ధం గురించి బెదిరింపులకు దిగుతూనే.. మరోవైపు సుద్దులు చెబుతూ.. ద్వంద వైఖరిని ప్రదర్శిస్తోంది. తాజాగా తమ వద్ద ఉన్న అణ్వాయుధాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్. తమ వద్ద అతి చిన్న వ్యూహాత్మక అణుబాంబులు ఉన్నాయని చెప్పారు.
పాకిస్తాన్ దగ్గర 125 గ్రాముల నుంచి 250 గ్రాముల సైజులో చిన్న బాంబులు కూడా ఉన్నాయని.. చాక్లెట్ సైజంత ఉన్న ఈ బాంబులు టార్గెట్లను ధ్వంసం చేయగలవన్నారు. జమ్ముకశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తి రద్దు చేస్తూ భారత్ సర్కారు నిర్ణయం తీసుకుందో.. అప్పటి నుంచి భారత్ తో తమకున్న సంబంధాలన్ని తెగిపోయినట్లు వ్యాఖ్యానించారు.
భారత్ మీదా.. ప్రధాని మోడీ మీద వ్యాఖ్యలు చేస్తున్న పాక్ ప్రధాని నుంచి మంత్రుల వరకూ వరుస షాకులు ఎదురవుతున్నాయి. ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ ఉదంతాన్ని చర్చకు తెచ్చినప్పటికీ.. భారత్ దాన్ని ధీటుగా ఎదుర్కోవటం.. ట్రంప్ వేలు పెట్టకుండా ఉండేలా చేయటం ప్రధాని మోడీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. పాక్ తో భారత్ యుద్ధానికి వస్తే ఇండియా 22 ముక్కలు అవుతుందంటూ చెప్పారు. ఆ మాట అన్న కాసేపటికే సదరు పాక్ మంత్రికి విద్యుత్ షాక్ తగలటం సంచలనంగా మారింది. దీంతో.. తన మీటింగ్ ను మోడీ ఆపలేరంటూ విపరీత వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ తన దగ్గరున్న అణ్వస్త్ర ఆయుధాల గురించి చెప్పిన దానికి భిన్నంగా తమవద్ద చాక్లెట్ సైజు బాంబులు ఉన్నాయంటూ పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయని చెప్పాలి.