Begin typing your search above and press return to search.

పాక్ ఓటమికి కారణమైన హసన్ అలీ భార్యను కూడా వదలట్లేదు

By:  Tupaki Desk   |   12 Nov 2021 3:30 PM GMT
పాక్ ఓటమికి కారణమైన హసన్ అలీ భార్యను కూడా వదలట్లేదు
X
టీమిండియాను, న్యూజిలాండ్ ను, గ్రూప్ లోని అన్ని జట్లను ఓడించి భీకరంగా కనిపించిన పాకిస్తాన్ టీం ప్రపంచకప్ టీ20 సెమీస్ లో గెలవాల్సిన దశలో ఓడిపోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ చివరి ఓవర్లలో రెచ్చిపోవడంతో చిత్తు అయ్యింది. ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్ మాథ్యువేడ్ ఇచ్చిన క్యాచ్ ను జారవిడిచి పాకిస్తాన్ ఓటమికి కారణమయ్యాడని పాక్ క్రికెటర్ హసన్ అలీపై పాక్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అతడిపై సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ సాగుతోంది.ముఖ్యంగా పాకిస్తాన్ ఫ్యాన్స్ అయితే చాలా దారుణంగా అతడిని ట్రోల్ చేస్తున్నారు.

ఆస్ట్రేలియాతో కీలక సెమీస్ లో 19వ ఓవర్ లో పాకిస్తాన్ ఒక అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకుంది. 10 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన సమయంలో మాథ్యువేడ్ ఇచ్చిన ఒక క్యాచ్ ను హసన్ అలీ మిస్ చేశాడు. బంతి వేగాన్ని సరిగా జడ్జ్ చేయలేక ముందుకు పరిగెత్తడంతో ఆ క్యాచ్ పట్టలేకపోయాడు. ఆ తర్వాత మూడు బంతులను మాథ్యూవేడ్ సిక్సులుగా మలచడంతో ఆస్ట్రేలియా జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.

హసన్ అలీ ఈ క్యాచ్ డ్రాప్ చేయడంపై సోషల్ మీడియాలో అతడిపై ట్రోలింగ్ పెరిగిపోయింది. ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ అయితే చాలా దారుణంగా అతడిని ట్రోల్ చేస్తున్నారు.

పాకిస్తాన్ పై ఓడిపోయిన తర్వాత భారత బౌలర్ మహ్మద్ షమిపై ఎలాంటి ట్రోలింగ్ జరిగిందో అంతకంటే దారుణంగా అలీని తిడుతూ పోస్టులు పెడుతున్నారు.

హసన్ అలీ క్యాచ్ డ్రాప్ చేయడం వల్ల మేం ఓడిపోయాం.. అదే టర్నింగ్ పాయింట్. అదే టర్నింగ్ పాయింట్ .. ఆ క్యాచ్ అందుకొని ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదంటూ కామెంట్ చేశాడు పాక్ కెప్టెన్ బాబర్ అజామ్.

పరిణితి లేని కెప్టెన్ గా తగ్గట్టే పాక్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా హసన్ అలీని, అతడి భార్యను, కుటుంబాన్ని బూతులు తిడుతూ సైబర్ దాడి చేస్తున్నారు. మహ్మద్ షమీపై జరిగిన సైబర్ అటాక్ ను ఖండించిన పాక్ క్రికెటర్లు ఎవ్వరూ.. హసన్ అలీ గురించి ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడం విశేషం.

హసన్ అలీ.. భారతదేశానికి చెందిన ఇంజినీర్ సమీయా అర్జూని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. శత్రుదేశానికి చెందిన అమ్మాయిని పెళ్లాడడంతో పాక్ జనాలు మరింత రెచ్చిపోయి సమీయా ఇన్ స్టా అకౌంట్ పై బూతులతో దాడి చేస్తున్నారు.

మరోవైపు.. సమీయాపై చేస్తున్న ట్రోలింగ్ ను టీమిండియా ఫ్యాన్స్ ఖండిస్తున్నారు. హసన్ అలీకి మద్దతుగా ఉన్నామని భరోసా ఇస్తూ 'Ind stand with Hassan Ali' హ్యాట్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.