Begin typing your search above and press return to search.

పాక్ ఆర్మీ చీఫ్ గజగజలాడారట.. పాక్ మంత్రి అభినందన్ ను వదిలేయమన్నారట

By:  Tupaki Desk   |   29 Oct 2020 5:10 PM GMT
పాక్ ఆర్మీ చీఫ్ గజగజలాడారట.. పాక్ మంత్రి అభినందన్ ను వదిలేయమన్నారట
X
పుల్వామా ఆత్మాహుతి దాడి.. దానికి ప్రతిగా పాక్ భూభాగంలోకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్ నిర్వహించటం.. అందుకు బదులు తీర్చుకునేందుకు పాకిస్తాన్ వైమానిక స్థావరాల మీద దాడికి ప్రయత్నించిన వేళ.. భారత వైమానిక శాఖ బలంగా తిప్పి కొట్టటం తెలిసిందే. ఈ క్రమంలో భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాక్ భూభాగంలో ప్రవేశించి.. అక్కడి సైన్యానికి చిక్కటం తెలిసిందే. అనంతరం.. అతడ్ని విడిచి పెడుతున్నట్లుగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించటంతో దాయాది దేశాల మధ్య కమ్ముకున్న యుద్ధమేఘాలు తేలిపోయాయి.

అభినందన్ పట్టుబడిన తర్వాత.. ఆయన్ను వదిలేస్తున్నట్లుగా ప్రకటించే సమయానికి మధ్యలో ఏం జరిగింది? అన్న దానిపై పెద్దగా సమాచారం బయటకు రాలేదు. ఈ విషయాల్ని తాజాగా పార్లమెంటు సభ్యుడు ఒకరు వెల్లడించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అభినందన్ పట్టుబడిన వేళ పాక్ ఆర్మీ చీఫ్ గజగజ వణికిపోయినట్లుగా పాక్ ఎంపీ ఒకరు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తాజాగా విడుదల చేశారు.

అందులో పాక్ ఎంపీ మాట్లాడిన ప్రసంగం ఉంది. అభినందన్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్ నో చెప్పగా.. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా అక్కడకు వచ్చారని.. ఆ సమయంలో ఆయన కాళ్లు వణుకుతూ.. శరీరం చెమటలు పట్టి ఉన్నట్లుగా పేర్కొన్నారు.

విదేశీ వ్యవహారాల మంత్రిషా మొహమూద్ ఖురేషీ మాట్లాడుతూ.. మీకు పుణ్యం ఉంటుంది. అభినందన్ ను తక్షణం వదిలేయండి.. లేదంటే ఇదే రోజు రాత్రి తొమ్మిది గంటలకు భారత్ మనపై దాడి చేయటానికి సిద్ధమవుతోందని పేర్కొన్నట్లు పాకిస్తాన్ ముస్లిం లీగ్ నేత.. ఎంపీ అయాజ్ సాదిక్ నాటి సంఘటనను పార్లమెంటులో వెల్లడించారు. ఆయనీ వివరాలు వెల్లడించిన సమయంలో సభలో ఇమ్రాన్ లేరు. బిహార్ ఎన్నికల కీలక వేళలో.. ఆర్జేడీ ముందంజలో ఉందన్న వాదన వినిపిస్తున్న వేళ.. మోడీ సర్కార్ వీరత్వం తెలిపేలా వీడియోను విడుదల చేయటం గమనార్హం.