Begin typing your search above and press return to search.

పరిశోధకుల సృష్టి: పెయింట్ తో కూడా వైరస్ నాశనం

By:  Tupaki Desk   |   17 July 2020 6:45 AM GMT
పరిశోధకుల సృష్టి: పెయింట్ తో కూడా వైరస్ నాశనం
X
మహమ్మారి వైరస్ పై విస్తృత పరిశోధనలు కొనసాగుతున్నాయి. అన్ని రంగాలు ఆ వైరస్ కట్టడి చర్యలు.. నివారణ మార్గాలను అన్వేషిస్తూ.. పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా ఆ వైరస్ ఉనికి లేకుండా చేసే పెయింట్ ను సృష్టించారు. పెయింట్ వేస్తే ఏ వైరస్ కూడా తట్టుకోలేక చనిపోయేలా రూపొందించారు. వైరస్ ను నిర్వీర్యం చేసే పెయింట్‌ను అమెరికాకు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు.

తలుపుల గడియలు, గ్లాస్‌ డోర్లపై, స్విచ్‌ బోర్డులు, షాపింగ్‌ మాల్స్‌లో ఉండే బుట్టలు, కార్ట్‌లపై ఈ పెయింట్‌ను వేస్తే.. దాని ఉపరితలంపై వైరస్ పడితే వెంటనే నిర్వీర్యమవుతుంది. ఆ విధంగా పెయింట్ ను తయారు చేశారు. దీనివల్ల వైరస్ వ్యాప్తిని చాలా వరకు నియంత్రించవచ్చని వర్జీనియా టెక్‌కు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ పెయింట్ పై ప్రయోగాత్మకంగా పరిశోధనలు చేశారు. ఈ పెయింట్‌ వేసిన గంట వ్యవధి వరకు 99.9 వరకు వైరస్‌ నిర్వీర్యమైనట్లు తేలిందని పరిశోధకులు ప్రకటించారు. ఆ పెయింట్ ను త్వరలోనే మార్కెట్ లో అందుబాటులోకి తేనున్నారు.