Begin typing your search above and press return to search.

మ‌న కుబేరులు సైతం ఈ కారును కొన‌లేర‌ట‌!

By:  Tupaki Desk   |   25 July 2018 5:06 AM GMT
మ‌న కుబేరులు సైతం ఈ కారును కొన‌లేర‌ట‌!
X
ఖ‌రీదైన వ‌స్తువుల్ని చూసినంత‌నే మ‌న‌సు పారేసుకోవ‌టం మామూలే. అయితే.. సామాన్యులే కాదు.. అస‌మాన్యులు.. రాజ‌కీయ.. సినీ ప్ర‌ముఖుల‌తో స‌హా.. కుబేరులు లాంటి వారు సైతం కొన్నింటిని సొంతం చేసుకోలేర‌న్న మాట‌ను గుర్తు చేసే కారు ఒక‌టి మార్కెట్లోకి వ‌చ్చింది.

ల‌గ్జ‌రీ కార్ల ముచ్చ‌ట వ‌చ్చినంత‌నే రోల్స్ రాయిస్.. లంబోర్గిని.. జాగ్వార్ పేర్లు చ‌ప్పున గుర్తుకు వ‌స్తుంటాయి. అయితే.. తాజాగా వ‌చ్చిన మార్కెట్ వీటికి మించింది.ఆ మాట‌కు వ‌స్తే.. ప్ర‌పంచంలో కుబేరులు చాలామందే ఉండొచ్చు. కానీ.. ఈ కారును ముగ్గురు మాత్ర‌మే సొంతం చేసుకోగ‌ల‌రు. ఈ కారు స్పెషాలిటీ ఏమంటే.. ప్ర‌పంచంలోకెల్లా అత్యంత ఖ‌రీదైన కారు.

ఈ కారును కొనాలంటే మ‌న టాప్ హీరోలు సైతం సొంతం చేసుకోలేని స్థాయి దీని సొంతం. ఎందుకంటే.. ఈ కారు విలువ అక్ష‌రాల రూ.121 కోట్ల వ‌ర‌కూ ఉంటుంది. ఇట‌లీ స్పోర్ట్స్ కార్ల త‌యారీ సంస్థ ప‌గానీ ఆటోమొబైల్ ప‌గానీ జోండా హెచ్ పీ బార్ చెట్టా పేరుతో విడుద‌లైన ఈ విలాస‌వంత‌మైన కారు.. ప్ర‌ముఖుల్ని సైతం సామాన్యులుగా మార్చి.. భ‌లే ఉంది. . కానీ కొన‌లేమ‌న్న‌ట్లుగా చేయ‌టం దీని స్పెషాలిటీ.

మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ ఖ‌రీదైన కార్ల‌ను మూడంటే.. మూడే రిలీజ్ చేయ‌టం. అత్యంత ఖ‌రీదైన ఈ కార్ల ముచ్చ‌ట ప్ర‌పంచ ప్ర‌జ‌ల‌కు తెలిసే లోపే.. ఈ కార్ల‌ను బుక్ చేసుకున్నార‌ట‌. ఈ కార్ల కంపెనీ వ్య‌వ‌స్థాప‌కుడు హోరాసియో ప‌గానీ ఒక కారును త‌న‌తో ఉంచేసుకుంటే.. మిగిలిన రెండు కార్ల‌ను ఇప్ప‌టికే అమ్మేశారు.

ఇంత‌కీ.. ఈ కారు సాంకేతిక అంశాల విష‌యానికి వ‌స్తే.. 7.3 లీట‌ర్ మెర్సిడెస్ ఏఎంజీ ఎం120వీ12 ఇంజిన్.. సిక్స్ స్పీడ్ మాన్యువ‌ల్ ట్రాన్స్ మిష‌న్ ప్ర‌త్యేక‌త‌లుగా చెబుతున్నారు. సున్నా నుంచి వంద కిలోమీట‌ర్ల వేగాన్ని కేవ‌టం 3.1 సెక‌న్ల‌లోనే అందుకోవ‌టం ఈ కారు ప్ర‌త్యేక‌త‌గా చెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌పంచంలోనే ఖ‌రీదైన కారుగా ఉన్న రోల్స్ రాయిస్ స్వెప్ టెయిల్ దీని ముందు దిగ‌దుడుపే అంటున్నారు. ఎందుకంటే ఆ కారు ఖ‌రీదు కేవలం రూ.84 కోట్లు మాత్ర‌మే మ‌రి.