Begin typing your search above and press return to search.

మ‌రోసారి ప‌ద్మ‌నాభ‌స్వామి ఆస్తుల వ్య‌వహారం వార్త‌ల్లోకి!

By:  Tupaki Desk   |   23 Sep 2021 10:36 AM GMT
మ‌రోసారి ప‌ద్మ‌నాభ‌స్వామి ఆస్తుల వ్య‌వహారం వార్త‌ల్లోకి!
X
ప్రపంచంలోని ఆల‌యాల్లో కెళ్లా అత్యంత సంప‌న్న‌మైన దేవాయాల్లో ఒక‌టిగా నిలుస్తున్న కేర‌ళ అనంత ప‌ద్మ‌నాభ స్వామి ఆల‌యం ఆస్తుల వ్య‌వ‌హారాలు మ‌రోసారి వార్త‌ల్లో నిలుస్తున్నాయి. ఈ ఆల‌య ఆదాయ వ్యయాల‌కు సంబంధించి పాతికేళ్ల ఆడిట్ ను నిర్వ‌హించాల‌ని సుప్రీం కోర్టు ఆదేశాల‌ను ఇచ్చిన నేప‌థ్యంలో.. ఈ విష‌యంలో ట్ర‌స్టు అభ్యంత‌రాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. పాతికేళ్లుగా ఆల‌య ఆదాయ‌వ్య‌యాల‌న్నింటిపై ఆడిట్ ను త‌ప్ప‌నిస‌రి చేస్తూ సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది. అయితే ఈ విష‌యంలో ట్ర‌స్టు అభ్యంత‌రం చెబుతోంది.

ఆడిట్ అవ‌స‌రం లేద‌ని సుప్రీం కోర్టును ఆశ్ర‌యించ‌గా, అక్క‌డ నిరాశ ఎదురైంది. ఆడిట్ ను త‌ప్ప‌నిస‌రిగా నిర్వ‌హించాల‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. అది కూడా మూడు నెల‌ల్లో పూర్తి కావాల‌ని స్పష్టం చేసింది. దీంతో ప‌ద్మ‌నాభ‌స్వామి ఆస్తులు, ఆదాయాలు, వ్య‌యాలు ఏ స్థాయిలో ఉన్నాయ‌నేది భ‌క్తుల్లో కూడా ఆస‌క్తిని రేకెత్తిస్తూ ఉంది.

ప‌ద్మ‌నాభ స్వామి ఆల‌య నిర్వహ‌ణ‌ను చూస్తున్న బోర్డును ట్రావెన్ కోర్ సంస్థానం వారు నియ‌మిస్తూ వ‌స్తుంటారు. కేర‌ళ‌లోని బోలెడ‌న్ని ఆల‌యాల నిర్వ‌హ‌ణ అంతా ఈ బోర్డుల ప‌రిధిలోనే ఉంది. ఆ బోర్డుల‌న్నీ ట్రావెన్ కోర్ రాజ‌వంశం వారి ఆధ్వ‌ర్యంలో ఏర్పాట‌వుతూ వ‌చ్చాయి. ఇలాంటి నేప‌థ్యంలో సంస్థానాధీశుల ఆధ్వ‌ర్యంలోని బోర్డులు ఎలా వ్య‌వ‌హ‌రిస్తుంటాయ‌నేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం. ప్ర‌భుత్వాలు ఏర్పాటు చేసే బోర్డుల విష‌యంలో త‌ప్ప‌నిస‌రిగా ఆడిట్ జ‌రుగుతూ ఉంటుంది. ఇక సంస్థానం బోర్డులు కావ‌డంతో.. ఇన్నాళ్లూ ఆడిట్ పై పెద్ద‌గా ప‌ట్టింపు లేక‌పోయిన‌ట్టుగా ఉంది.

అది కూడా అత్యంత సంప‌న్న ఆల‌యాల్లో ప‌ద్మ‌నాభ స్వామి ఆల‌యం ముందు వ‌ర‌స‌లో నిలుస్తూ ఉంటుంది. ఇలాంటి నేప‌థ్యంలో అక్క‌డ ఆడిట్ అంటే స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తించే అంశ‌మే. అందులోనూ బోర్డు అభ్యంత‌రం చెబుతోంది, కోర్టేమో ఆడిట్ త‌ప్ప‌ద‌ని అంటోంది. అందులోనూ పాతికేళ్ల చిట్టాను తీయ‌మంటోంది. మూడు నెల‌ల గ‌డువును విధించింది.