Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: కరోనాతో పద్మశ్రీ అవార్డు గ్రహీత నిర్మల్ సింగ్‌ మృతి

By:  Tupaki Desk   |   2 April 2020 7:00 AM GMT
బ్రేకింగ్: కరోనాతో  పద్మశ్రీ అవార్డు గ్రహీత నిర్మల్ సింగ్‌ మృతి
X
మహ్మమారి కరోనా వైరస్‌ సోకి పద్మశ్రీ అవార్డు గ్రహీత నిర్మల్‌ సింగ్‌ ఖల్సా తుది శ్వాస విడిచారు. ఇటీవల లండన్‌ నుంచి తిరిగివచ్చిన ఈయనకు బుధవారం వైద్యులు పరీక్ష నిర్వహించగా కరోనా పాజిటివ్‌ అని వచ్చింది. నిర్మల్ సింగ్ కు కరోనా వైరస్ పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో అతన్ని ఐసోలేషన్ గదికి తరలించి చికిత్స చేస్తుండగా మరణించారు. స్వర్ణ దేవాలయ కమిటీలో పనిచేసిన నిర్మల్ సింగ్ కు బుధవారం కరోనా వైరస్ సోకిందని తేలడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగా గురువారం తెల్లవారుజామున 4.30 గంటలకు మరణించారని పంజాబ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేబీఎస్ సిద్ధూ చెప్పారు.

నిర్మల్ సింగ్ కు కరోనా వైరస్ పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో అతన్ని ఐసోలేషన్ గదికి తరలించి చికిత్స చేస్తుండగా మరణించారు. స్వర్ణ దేవాలయ కమిటీలో పనిచేసిన నిర్మల్ సింగ్ కు బుధవారం కరోనా వైరస్ సోకిందని తేలడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగా గురువారం తెల్లవారుజామున 4.30 గంటలకు మరణించారని పంజాబ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేబీఎస్ సిద్ధూ చెప్పారు.

పంజాబ్‌ లో ఇది రెండో కరోనా కేసు కాగా, జిల్లాలో మరణించిన తొలి వ్యక్తి ఖల్సాయే. అంతకుముందు హోషియార్‌ పూర్‌ కు చెందిన కరోనా పాజిటివ్ రోగి అమృత్‌ సర్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.62 ఏళ్ల ఖల్సా 2009లో పద్మశ్రీ పౌర పురస్కారాన్ని అందుకున్నారు.ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన సింగ్. కాగా మరోవైపు దేశంలో కరోనా వైరస్‌ రోజురోజూకూ విజృభిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2032 కి పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 58 మంది మృతి చెందారు.