Begin typing your search above and press return to search.

పొంగులేటికి దిమ్మ తిరిగేలా ప‌ద్మారావు పంచ్‌!

By:  Tupaki Desk   |   1 Nov 2017 6:01 PM GMT
పొంగులేటికి దిమ్మ తిరిగేలా ప‌ద్మారావు పంచ్‌!
X
ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయేలా మాట్లాడి తెగ ఇబ్బంది పెట్టేసే నేత‌లు కొంద‌రు క‌నిపిస్తారు. ఏం అన్నా.. త‌మ‌దే పైచేయి అన్న‌ట్లుగా వారి మాట‌లు ఉంటాయి. ఇలాంటి వారికి కొన్ని సంద‌ర్భాల్లో అనుకోని రీతిలో షాకులు ఎదుర‌వుతుంటాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాక‌ర్ రెడ్డికి ఇలాంటి అనుభ‌వ‌మే ఎదురైంది.

త‌న మాట‌ల‌తో మంత్రి ప‌ద్మారావును డిఫెన్స్ లో ప‌డేయాల‌ని చూసిన పొంగులేటికి ఊహించ‌నిరీతిలో వ‌చ్చిన స‌మాధానం ఆయ‌న నోట మాట రాకుండా చేసింద‌ని చెప్పాలి. గుడుంబా నిర్మూల‌న.. పున‌రావాసంపై చేప‌ట్టిన స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ శాస‌న మండ‌లిలో జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం మంత్రిగా ప‌ని చేస్తున్న ప‌ద్మారావు గ‌తంలో కాంగ్రెస్ లో ప‌ని చేశార‌ని గుర్తు చేశారు. దీంతో.. ఒళ్లు మండిన ప‌ద్మారావు ఊహించ‌ని రీతిలో బ‌దులిచ్చారు. కాంగ్రెస్‌పార్టీలో తాను 20 ఏళ్లు ప‌ని చేస్తే స్వీటు ప్యాకెట్ త‌ప్ప ఏనాడు భీఫారం ఇవ్వ‌లేద‌న్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న‌న్ని రోజులు త‌న స‌ర్వ‌స్వాన్ని కోల్పోయాన‌ని ఫైర్ అయ్యారు.

కాంగ్రెస్ హ‌యాంలో ప్ర‌త్యామ్నాయంగా ఏ పార్టీ లేనందుకే తెలంగాణ ఉద్య‌మంలో ప‌ని చేసి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యాన‌ని.. అసెంబ్లీ.. శాస‌న‌మండ‌లి వ‌ర‌కూ వ‌చ్చాన‌న్నారు. ఒక‌వేళ తానుకానీ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఉంటే అసెంబ్లీలోకి కూడా అడుగుపెట్టేవాడిని కాద‌ని మంత్రి ప‌ద్మారావు మాట్లాడ‌టంతో కాంగ్రెస్ నేత పొంగులేటి నోట మాట రాని ప‌రిస్థితి నెల‌కొంది.