Begin typing your search above and press return to search.

పద్మ అవార్డులను బీజేపీ న్యాయంగానే ఇచ్చిందా?

By:  Tupaki Desk   |   28 Jan 2023 8:00 PM GMT
పద్మ అవార్డులను బీజేపీ న్యాయంగానే ఇచ్చిందా?
X
బీజేపీ వచ్చాక సామాన్యులకు కూడా పద్మ అవార్డులు వస్తున్నాయి. మన గల్లీలు, ఊళ్లలో సామాజిక సేవ చేసే వారికి కూడా గుర్తింపు దక్కుతోంది. అయితే ఇందులో కొంచెం రాజకీయ కోణాలు కూడా బయటపడడమే బీజేపీకి మరకలు పడేలా చేస్తోంది. ప్రతీ ఏడాది గణతంత్ర దినోత్సవానికి పద్మ అవార్డులు ప్రకటించడం సంప్రదాయంగా వస్తోంది. పద్మ అవార్డులను కేంద్రం ఈసారి కూడా ప్రకటించింది. ఇందులో కొన్ని రాజకీయ పురస్కారాలు ఉండడమే విమర్శలకు తావిచ్చింది. అత్యధికం ఎలాంటి రాజకీయ ఒత్తిడులు సిఫార్సులు లేని వారికే దక్కాయి. కానీ కొన్ని మాత్రం విమర్శల పాలు అవుతున్నాయి.

ఏపీ, తెలంగాణ నుంచి పదవి మంది వరకూ పద్మ పురస్కారాలు దక్కాయి. వీరిలో అందరూ పద్మ అవార్డులకు అర్హులే. ఒక్కరూ లాబీయింగ్ చేసుకునే కాదు. తమకు అవార్డు ఇవ్వాలని వెంటపడిన వారు కాదు. కాకినాడుకు చెందిన సంకురాత్రి రామారావు చేసిన సేవాల గురించి పద్మ అవార్డు వచ్చిన తర్వాతనే ఎక్కువమందికి తెలిసింది.

దాదాపుగా అవార్డులన్నీ ఇలాంటి నిస్వార్థ సేవ చేసినవారికి దక్కాయి. గతంలో పద్మ అవార్డులు సిఫార్సుల మేరకే ఇచ్చేవారు. దాంతో అవి రాజకీయ మద్దతు ఉన్న వారికే లభించేవి. కేంద్రం ఈ ఆనవాయితీని చాలా వరకూ మార్చింది. రాజకీయ సిఫార్సులు, ప్రయోజనాల విషయాన్ని పరిమితం చేసింది. అవి తప్పనిసరి అయినా కూడా తగ్గించేసింది.

ఈ పద్మ అవార్డుల గొప్పతనం పెరిగేలా వివిధ కేటగిరిల్లో పద్మాలను గుర్తించి అవార్డులను ఇస్తోంది. ఇది ఖచ్చితంగా మంచిదే అయినా కూడా లాబీయింగ్ చేసుకొని తెచ్చుకునే అవార్డ్ కన్నా కనీసం దరఖాస్తు చేసుకోకుండా సేవలను, ప్రతిభను గుర్తించి కేంద్రం ఇచ్చే అవార్డుకు విలువ ఉంటుంది.

అయితే ములాయం సింగ్ సహా పలువురు రాజకీయ నేతలకు ఓట్లు, కులం, ప్రాతిపదికన కేటాయించడం వివాదాస్పదమైంది. ఆ అవార్డుకు అర్హులు కాకున్నా కొన్ని రాజకీయ కోణంలో పంపిణీ చేస్తున్నారు. ఇదే విమర్శలకు తావిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.