Begin typing your search above and press return to search.

మ్యాచ్ కు ముందు శృంగారం.. టీమిండియాకు సూచన

By:  Tupaki Desk   |   2 July 2021 10:39 AM GMT
మ్యాచ్ కు ముందు శృంగారం.. టీమిండియాకు సూచన
X
ప్రపంచ కప్ లాంటి మ్యాచుల్లో ఎంతటి గొప్ప ఆటగాడు అయినా సరే ఒత్తిడిలోకి జారిపోతున్నారు. 10ఏళ్లు ఆడిన సీనియర్ అయినా కూడా చిత్తు అయిపోతాడు. ఇక ఫైనల్ మ్యాచ్ ఆడే ఆటగాళ్ల మెంటల్ కండీషన్ ఏలా ఉంటుందో ఊహకు అందని విషయంగా ఉంది. కాస్తా ఆందోళన, మనసులో భయం వెంటాడుతుంది.

ఆ నెర్వస్ నెస్ టీమిండియాకు కూడా ఉంది. ఇటీవల ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ లో అందుకే ఓడింది. ఇక గత వన్డే ప్రపంచకప్ లోనూ ఇదే గతి పట్టింది. అందుకే నిపుణులు, కోచ్ లు ఫైనల్ కు ముందు మానసిక నిపుణులతో ఆటగాళ్లకు కౌన్సిలింగ్ లు ఇప్పిస్తుంటారు.

2011 వన్డే ప్రపంచకప్ సమయంలో టీమిండియా ఆటగాళ్లకు అప్పటి మెంటల్ కండీషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ కూడా ఓ వింత సూచన చేశాడట.. మ్యాచ్ లకు ముందు శృంగారంలో పాల్గొనాలని ఆటగాళ్లకు సూచించాడట.. దాంతో అప్పటి కోచ్ గ్యారీ కిర్ స్టన్ కు ఈ సలహా విని నోట మాట రాలేదట.. ఏం చెప్పాలో తెలియక బిగుసుకుపోయాడట.. ఈ విషయాలను స్వయంగా ప్యాడీ ఆప్టన్ తన ఆత్మకథ ‘ది బేర్ ఫుట్ కోచ్’ పుస్తకంలో రాసుకొచ్చాడు. అవిప్పుడు వైరల్ అయ్యాయి.

అయితే మ్యాచ్ కు ముందు శృంగారం చేయాలని తాను టీమిండియా ఆటగాళ్లకు సలహా ఇచ్చినందుకు తర్వాత సారీ చెప్పానని ఆప్టన్ తెలిపారు. ఇక 2009 చాంపియన్స్ ట్రోపీకి సిద్ధమవుతున్న సమయంలోనూ దీని గురించి నోట్స్ లో రాశాడట ఆప్టన్. శృంగారం చేయడం వల్ల ఖచ్చితంగా ఆటగాళ్ల ప్రదర్శన మెరుగవుతుందని నోట్స్ లో రాసుకొచ్చాడు.

కోచ్ గా ఉన్నప్పుడు తాను చేసిన సంగతులు.. ఇచ్చిన సలహాలన్నీ ప్యాడీ ఆప్టన్ తన పుస్తకంలో వివరించాడు. 2011లో టీమిండియా ప్రపంచకప్ గెలవడంతో ఇవన్నీ పనిచేశాయని అంటున్నారు. యువరాజ్ సింగ్ బాగా రాణించి టీమిండియా విజయానికి కారణమయ్యాడు. అందుకే నాటి విజయం ఎలా సాధ్యమైందో తెలిపేలా ప్యాడీ ఆప్టన్ రాసిన పుస్తకం ఇప్పుడు వైరల్ గా మారింది.