Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తిలో నారాయ‌ణ‌కు 3129 ఎక‌రాలు

By:  Tupaki Desk   |   29 Aug 2019 10:52 AM GMT
అమ‌రావ‌తిలో నారాయ‌ణ‌కు 3129 ఎక‌రాలు
X
అమ‌రావ‌తిలో టీడీపీ నాయ‌కులు వేలాది ఎక‌రాలు భూములు పోగేసుకున్నార‌ని గ‌త మూడునాలుగేళ్లుగా తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇక తాజాగా రాజ‌ధాని మార్పు మ‌రోసారి తెర‌మీద‌కు రావ‌డంతో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ నేత‌ల మ‌ధ్య తీవ్ర‌మైన మాట‌ల యుద్ధం న‌డుస్తోంది. వైసీపీ అమ‌రావ‌తి నుంచి రాజ‌ధాని మార్చేస్తుంద‌ని టీడీపీ నేత‌లు పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఇప్పుడు వైసీపీ నేత‌లు కూడా టీడీపీపై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

సీఆర్‌డీఏలో వేలాది ఎక‌రాల భూమిని అన్ని మార్గాల ద్వారా టీడీపీ నేత‌లు స్వాధీనం చేసుకున్నార‌ని వైసీపీ నేత‌లు, మంత్రులు విరుచుకుప‌డుతున్నారు. బాల‌య్య అల్లుడు శ్రీభ‌ర‌త్‌- బీజేపీ నాయ‌కుడు సుజ‌నా చౌద‌రి ఆక్ర‌మించుకున్న భూముల‌కు సంబంధించి కొన్ని ప‌త్రాల‌ను ఆధారంగా చూపిస్తూ బొత్స విమ‌ర్శ‌లు చేయ‌గా వాటిని వారిద్ద‌రు ఖండించారు.

ఇక టీడీపీ పాల‌న‌లో కీల‌క‌మైన మునిసిప‌ల్ శాఖా మంత్రిగాను- సీఆర్డీయేలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన నారాయ‌ణ‌కు సీర్డీయే ప‌రిధిలో రూ.10 వేల కోట్ల విలువ చేసే 3,129 ఎక‌రాల భూములు ఉన్నాయ‌ని వైసీపీ నేత ర‌వీంద్ర సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తాను నారాయ‌ణ‌పై ఎలాంటి నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌డం లేద‌ని.. తాను ఆధారాలు సేక‌రిస్తున్న‌ట్టు కూడా ర‌వీంద్ర బాంబు పేల్చాడు. ఓ న్యూస్ ఛానెల్ చ‌ర్చ‌లో ఆ నేత ఈ వ్యాఖ్య‌లు చేశాడు.

నారాయ‌ణ‌కు ఈ భూముల‌తో నేరుగా సంబంధం లేక‌పోయినా... ఆయ‌న బినామీల పేర్ల‌తో కూడా ఉండ‌వ‌చ్చ‌ని సందేహం వ్య‌క్తం చేశాడు. ఈ క్ర‌మంలోనే టీడీపీ పెద్ద‌లు సీఆర్డీయేలో ఎన్ని వేల ఎక‌రాలు ఆక్ర‌మించుకున్నా... దీని వెన‌క ఎంత మంది ఉన్నా వారిని వైసీపీ ప్ర‌భుత్వం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వ‌ద‌ల‌ద‌ని కూడా ఆయ‌న చెప్పారు. ఏదేమైనా ఐదేళ్ల‌లో సీఆర్డీయే ప‌రిధిలో జ‌రిగిన భూముల అవ‌క‌త‌వ‌క‌ల‌పై వైసీపీ సీరియ‌స్‌గా యాక్ష‌న్‌ కు రెడీ అవుతుండ‌డం టీడీపీ నేత‌ల గుండెళ్లో రైళ్లు ప‌రిగిత్తిస్తోంది.