Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌తో మొహ‌మాటం... కీల‌క‌ ప‌ద‌వి కోల్పోయిన కామ్రేడ్‌!

By:  Tupaki Desk   |   30 Dec 2021 1:30 AM GMT
జ‌గ‌న్‌తో మొహ‌మాటం... కీల‌క‌ ప‌ద‌వి కోల్పోయిన కామ్రేడ్‌!
X
రాజ‌కీయాల్లో బంధుత్వాలు.. స్నేహితులు ఉన్నా.. స‌మ‌యానికి త‌గిన విధంగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోతే.. క‌ష్ట‌మే. ముఖ్యంగా ప్ర‌త్య‌ర్థి పార్టీలైతే.. ఇది మ‌రీ డేంజ‌ర్‌. ఇప్పుడు ఈ విష‌యం ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే.. తాజాగా ఏపీలో కీల‌క ప‌ద‌విలో ఉన్న క‌మ్యూనిస్టు సీఎం జ‌గ‌న్ విష‌యంలో త‌న‌కుఉన్న బంధుత్వం బంధుత్వం, స్నేహం, సానుభూతి చూపిన కార‌ణంగా.. ప‌ద‌వికి త‌నే ఎస‌రు పెట్టుకున్నార‌నే కామెంట్లు క‌మ్యూనిస్టు నేత‌ల్లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

గుంటూరు జిల్లా తాడేప‌ల్లి వేదిక‌గా.. జ‌రుగుతున్న 26వ సీపీఎం రాష్ట్ర‌ మహాసభల్లో.. రాష్ట్రానికి కొత్త ప్రధాన కార్యదర్శిని ఎన్నుకు న్నారు. ఇప్పటి వరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా పి.మధు(పిన్నెల్లి మ‌ధుసూద‌న్‌రెడ్డి) కొనసాగగా.. కొత్త కార్యదర్శిగా వి.శ్రీనివాసరావు(ఈయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు జాతీయ రాజ‌కీయ నేతగా ఏపీ నుంచి ప్రాతినిధ్యం వ‌హించారు. అదేస‌మ‌యంలో గ‌తంలో ప్ర‌జాశ‌క్తి దిన‌ప‌త్రిక ఎడిట‌ర్‌గా కాల‌మిస్టుగా కూడా వ్య‌వ‌హ‌రించారు) ఎన్నికయ్యారు. 50 మంది సభ్యులతో రాష్ట్ర కమిటీని ప్రకటించారు. ప్రస్తుత కార్యదర్శి పి.మధుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా మాత్ర‌మే చోటు కల్పించారు.

వాస్త‌వానికి రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. మ‌ధు ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీకి సేవ‌లు అందించారు. అయితే.. గ‌తం క‌న్నా.. ఇటీవ‌ల రెండేళ్లుగా ఆయ‌న ప‌నితీరు.. పార్టీలోని సీనియ‌ర్ నేత‌ల‌కు, ముఖ్యంగా కేంద్ర‌క‌మిటీ స‌భ్యుల‌కు న‌చ్చ‌డం లేదు. ప్ర‌భుత్వ విధానాల‌పై పోరా డాల్సిన స‌మ‌యంలో ఆయ‌న వెనుకంజ వేశారు. అదేస‌మ‌యంలో రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో పార్టీ వైఖ‌రిని ప్ర‌ద‌ర్శించేం దుకు కూడా ఆయ‌న చొర‌వ చూప‌లేక పోయారు. అంతేకాదు.. ఆయ‌న ఏనాడూ.. సీఎం జ‌గ‌న్ను కానీ.. ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను కానీ ప్ర‌శ్నించ‌లేక పోయారు.

వాస్త‌వానికి ఉద్య‌మాల పురిటి గ‌డ్డ‌గా ఉన్న ఏపీలో క‌మ్యూనిస్టుల కంచుకోట‌ల్లోనూ.. ఈ ప‌రిణామం.. తీవ్ర ఇబ్బందికి గురి చేసింది. ఇక‌, ఆయ‌న హ‌యాంలోనే రెండు సార్వ‌త్రిక ఎన్నిక‌లు.. స్థానిక ఎన్నిక‌లు, కార్పొరేష‌న్‌, ప‌రిష‌త్ ఎన్నిక‌లు వ‌చ్చాయి. అయితే.. ఎక్క‌డా క‌మ్యూనిస్టుల ప్ర‌భావం క‌నిపించ‌లేదు. దీనికి మ‌ధు అనుస‌రిస్తున్న వైఖ‌రే కార‌ణ‌మ‌ని.. రాష్ట్ర నేత‌లు చాలామంది కేంద్ర నాయ‌క‌త్వానికి ఫిర్యాదు చేశారు.

సీఎం జ‌గ‌న్‌తో మ‌ధు సూద‌న్‌రెడ్డికి ఉన్న బీర‌కాయ పీచు చుట్ట‌రికం, ఆయ‌న‌తో ఉన్న స‌న్నిహిత‌త్వం..పార్టీ ప‌త్రిక స‌హా వ్య‌క్తిగ‌తంగా కొంద‌రికి జ‌రుగుతున్న స‌ర్కారీ మేళ్ల నేప‌థ్యంలో మ‌ధు దూకుడు చూపించ‌లేక పోయారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అనుకున్న‌ట్టుగానే.. పార్టీ ఆయ‌న‌ను పక్క‌న పెట్టి.. కీల‌క బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించింది.