Begin typing your search above and press return to search.

టీడీపీ.. బీజేపీ అభ్య‌ర్థి దేవ‌య్య‌

By:  Tupaki Desk   |   2 Nov 2015 1:34 PM GMT
టీడీపీ.. బీజేపీ అభ్య‌ర్థి దేవ‌య్య‌
X
వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక ర‌స‌వ‌త్త‌రంగా మార‌నుంది. ఇప్ప‌టికే తెలంగాణ అధికార‌ప‌క్ష‌మైన టీఆర్ ఎస్‌.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ త‌న అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే.. టీడీపీ.. బీజేపీ అభ్య‌ర్థిని మాత్రం ప్ర‌క‌టించ‌లేదు.

తాజాగా ఆ స‌స్పెన్స్ తీరిపోయింది. టీడీపీ.. బీజేపీ ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా దేవ‌య్య పేరును ఖ‌రారు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. కాసేప‌ట్లో అధికారికంగా ఈ నిర్ణ‌యాన్ని వెల్ల‌డించ‌నున్నారు. ఎన్ఆర్ ఐ అభ్య‌ర్థిగా సుప‌రిచితుడైన దేవ‌య్య స‌రైన అభ్య‌ర్థిగా భావిస్తూ బీజేపీ నాయ‌క‌త్వం నిర్ణ‌యం తీసుకోవ‌టంతో.. ఆయ‌న ఎన్నిక‌ల గోదాలో దిగ‌నున్నారు.

దేవ‌య్య అమెరికాలోని ఫ్లోరిడా నివాసి. విద్యావంతుడు.. మేధావిగా ఆయ‌న‌కు పేరుంది. ప్రఖ్యాత హార్వ‌ర్డ్ విశ్వ‌విద్యాల‌యంలో మెడిసిన్ చేశారు. దేవ‌య్య త‌ల్లిదండ్రులు స్వ‌ర్గీయ ప‌గిడిపాటి ర‌త్నం.. ప‌గిడిపాటి కోట‌మ్మలు. 1946లో జ‌న్మ‌నించిన ఆయ‌న కుటుంబం ప‌లు ప్రాంతాలు దాటి.. చివ‌ర‌కు జ‌న‌గాంలో స్థిర‌ప‌డింది. మెడిసిన్ ఇండియాలోనే చేసినా.. పీజీ మాత్రం హార్వ‌ర్డ్ లో చ‌శారు. కాక‌తీయ మెడిక‌ల్ కాలేజీలో 1971లో ప‌ని చేశారు.

అక్క‌డున్న‌ప్పుడే ఆయ‌న డాక్ట‌ర్‌ రుద్ర‌మ‌దేవిని వివాహ‌మాడారు. విద్యావంతుడైన అభ్య‌ర్థిని రంగంలోకి దింప‌టంతో పాటు.. ఆయ‌న్ను కానీ వరంగ‌ల్ ప్ర‌జ‌లు గెలిపిస్తే.. మోడీ క్యాబినెట్ లో మంత్రిహోదా ద‌క్క‌టం ఖాయ‌మ‌ని.. అదే జ‌రిగితే తెలంగాణ‌కు మ‌రింత అభివృద్ధి జ‌రిగే అవ‌కాశం ఉంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతుంది. ప్ర‌ధాన‌ రాజ‌కీయ ప‌క్షాల‌న్నీ త‌మ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌టంతో వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక ర‌స‌వ‌త్త‌రంగా మార‌నుంది.