Begin typing your search above and press return to search.

ఓజోన్ రంధ్రం పూడిన క్రెడిట్ కరోనాది కాదట!

By:  Tupaki Desk   |   29 April 2020 3:34 PM GMT
ఓజోన్ రంధ్రం పూడిన క్రెడిట్ కరోనాది కాదట!
X
సోషల్ మీడియా పరిధి పెరిగే కొద్దీ నిజాల కంటే అబద్ధాలే చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. కాస్త లాజిక్కు ఉండేలా.. చదివినంతనే నమ్మేలా స్క్రిప్టును రెడీ చేసుకొని పోస్టు చేయటం.. అది కాస్తా వైరల్ గా మారటం ఈ మధ్యన ఎక్కువైంది. గడిచిన రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ తెగ హల్ చల్ చేస్తున్న పోస్టు.. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో లాక్ డౌన్ విధించటంతో అప్పుడెప్పుడో అంటార్కిటికాలో పడిన రంధ్రం.. తాజాగా పూడుకుపోయినట్లుగా పోస్టులు వచ్చాయి.

ఏళ్లకు ఏళ్లుగా ఓజోన్ రంధ్రం పూడ్చేందుకు జరిగిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. అయినప్పటికీ సాధ్యం కాలేదు. అలాంటిది కరోనా కారణంగా గడిచిన కొద్దిరోజులుగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల యాక్టివిటీస్ ఆపేసిన నేపథ్యంలో కాలుష్యం పెద్ద ఎత్తున తగ్గినట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఓజోన్ పొరకు పడిన రంధ్రం కూడా పూడుకుపోయినట్లుగా వస్తున్న వార్తల్లో వాస్తవం ఏ మాత్రం లేదు. సోషల్ మీడియాలో వచ్చే చాలా ఫేక్ న్యూస్ కోవకే ఈ వార్త చేరుతుందని చెప్పాలి.

లాక్ డౌన్ కారణంగా ఓజోన్ పొరకు పడిన రంధ్రం పూడలేదని.. కాకుంటే బలమైన ధ్రువ చక్రవాతం అసాధారణ స్థాయిలో ఎక్కువ రోజులు ఉండటం కారణంగానే ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రం పూడిందే తప్పించి.. లాక్ డౌన్ వల్ల కాదని తేల్చారు. ఇప్పటివరకూ సాగిన ప్రచారం మొత్తం బిస్కెట్ అని చెబుతున్నారు. సో.. ఓజోన్ రంధ్రం పూడిన క్రెడిట్ కరోనాది ఎంతమాత్రం కాదన్నది మర్చిపోకూడదు.