Begin typing your search above and press return to search.

ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత .. 500 మంది భాదితుల ఎదురుచూపు ..

By:  Tupaki Desk   |   21 April 2021 5:31 AM GMT
ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత .. 500 మంది భాదితుల ఎదురుచూపు ..
X
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ సాధారణంగా లేదు. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు ఎక్కువ సంఖ్య లో వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర , ఢిల్లీ కరోనా కి హాట్ స్పాట్ గా మారింది. ఈ క్రమంలో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ జీటీవీ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఉందని.. సమస్య పరిష్కరించాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ ను రిక్వెస్ట్ చేశారు. గత 4 గంటల నుంచి జీటీబీ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఉందని సత్యేంద్ర జైన్ , ఆ హాస్పిటల్ లో 500 మంది రోగులు ఆక్సిజన్ కోసం చూస్తున్నారని వివరించారు. ఆయన రాసిన మేసెజ్ స్కీన్ షాట్ తీసి ట్వీట్ చేశారు.

అంతేకాదు, అర్ధరాత్రి 2 గంటల వరకు మాత్రమే ఇప్పుడు ఉన్న ఆక్సిజన్ అందించగలుగుతామని అన్నారు. ఆక్సిజన్ లేకపోతే 500 మంది రోగులు ఇబ్బంది పడతారని చెప్పారు. ఢిల్లీలో దవాఖానలకు రోజుకు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతుందని చెప్పారు. కానీ 240 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందజేశారని వివరించారు. మంగళవారం అదీ 365 మెట్రిక్ టన్నులకి చేరిందని చెప్పారు. ఢిల్లీ దవాఖానల్లో ఆక్సిజన్ కొరత ఉందని అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన సంగతి తెలిసిందే. ఐసీయూ బెడ్ల కొరత కూడా ఉందని వివరించారు. మంగళవారం ఢిల్లీలో 28 వేల 395 కేసులు వచ్చాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 85 వేల 500 చేరింది. ఢిల్లీలో వైరస్ మహమ్మారి శరవేగంగా పాకిపోతోంది. తాజాగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోనూ కరోనా కలకలం రేగింది. కేజ్రీవాల్ అర్ధాంగి సునీతకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. భార్యకు కరోనా సోకడంతో కేజ్రీవాల్ కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఇంటి నుంచే కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు.అటు, కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుండడంతో ఢిల్లీలో బెడ్లు దొరకడంలేదని రోగులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం అదనపు బెడ్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంది. ఢిల్లీలో నేటి నుంచి లాక్ డౌన్ అమల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. కొవిడ్ ను ఎదుర్కొనేందుకు ప్రజలందరూ సహకరించాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.