Begin typing your search above and press return to search.
ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ - కోట్లాది డోసుల తయారీకీ సీరమ్ రెడీ
By: Tupaki Desk | 18 July 2020 4:00 PM GMTఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవిడ్ 19 వ్యాక్సిన్ చాలా వరకు విజయవంతవం అయినట్టు అర్థమవుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే దసరా లోపే ఈ వ్యాక్సిన్ సాధారణ వినియోగంలోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ఆస్ట్రా జెనెకా సంస్థ వేర్వేరు దేశాల్లోని ఫార్మా కంపెనీలతో వ్యాక్సిన్ ఉత్పత్తికి ఒప్పందాలు చేసుకుంది. కెనడా, రష్యాలకు చెందిన కంపెనీలతో ఒప్పందం చేసుకున్న ఆ కంపెనీ మన దేశానికి చెందిన సీరమ్ ఇన్ స్టిట్యూట్ తో కూడా భారీ ఒప్పందాన్ని చేసుకుంది.
ఈ ఒప్పందంపై సీరమ్ సీఈవో పూనావాలా స్పందించారు. వచ్చే మూడు నెలల్లో మిలియన్ల కొద్దీ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడమే తమ లక్ష్యం అన్నారు. ఈ కంపెనీ వ్యాక్సిన్ ల తయారీలో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచింది. ఇప్పటికే వేర్వేరు వ్యాధుల నివారణకు 150 కోట్ల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసి ప్రపంచానికి అంచింది. తాజాగా కోవిడ్ 19 వ్యాక్సిన్ ఉత్పత్తిలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. బహుశా ఆయన మాటలు బట్టి ఇప్పటికే వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో వినియోగానికి పనికొచ్చే విధంగా తయారైనట్టు అర్థం చేసుకోవచ్చు.
వ్యాక్సిన్ ఉత్పత్తికి అవసరమైన అనుమతులను భారత ప్రభుత్వానికి చెంది డీసీజీఐ ఇప్పటికే మంజూరు చేసింది. ఎంత వేగంగా ఉత్పత్తి చేసినా... ప్రపంచంలోని పౌరులందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి చాలా సమయం పడుతుందని పూనావాలా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా... ఈ కంపెనీ వీపీఎం బీసీజీ వ్యాక్సిన్ ని కోవిడ్ కోసం 1000 మంది మీద ట్రయల్స్ నిర్వహించిది. అది ఎంతవరకు ఫలిస్తుందో వేచిచూస్తున్నాం అని పూనావాలా తెలిపారు.