Begin typing your search above and press return to search.

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ భారత్ కు వచ్చేసింది.. ఏం చేయనున్నారు

By:  Tupaki Desk   |   3 Aug 2020 6:30 AM GMT
ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ భారత్ కు వచ్చేసింది.. ఏం చేయనున్నారు
X
కరోనా కారణంగా విలవిలలాడుతున్న ప్రపంచానికి ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ రూపొందిస్తున్న వ్యాక్సిన్ కొత్త ఆశల్ని రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సంస్థ డెవలప్ చేసిన వ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్ విజయవంతం కావటం.. దీనికి సంబంధించిన విశేషాల్ని ప్రఖ్యాత మెడికల్ జర్నల్.. లాన్సెట్ లో ప్రచురించటం తెలిసిందే. తాము చేసిన హ్యుమన్ ట్రయల్స్ ను చెక్ చేసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగాఉన్నపలు దేశాల్లోనూ ప్రయోగాల్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా భారత్ లోనూ ప్రయోగాలు జరిపేందుకు వీలుగా ఈ వ్యాక్సిన్ ను దేశానికి తీసుకొచ్చారు.

ఇప్పటికే ఫేజ్ 2.. ఫేజ్ 3లో ప్రయోగాలు సక్సెస్ అయన నేపథ్యంలో దేశీయంగా సీరిమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు డీసీజీఐ అనుమతల్ని ఇచ్చింది. ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ.. ఆస్ట్రా జెనికాలు ఉమ్మడిగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ప్రయోగాలకు దేశీయంగా సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు అనుమతులు లభించాయి.

దీంతో.. సదరు వ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్ షురూకానున్నాయి. ఆక్స్ ఫర్డ్.. ఆస్ట్రా జెనికా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ను ఇండియాలో కోవిషీల్డ్ గా పిలుస్తున్నారు. దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ ముంబయి.. ఫూణెలలో నిర్వహించనున్నారు. వీటి ఫలితాల మీద ఇప్పుడుసర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ వ్యాక్సిన్ వచ్చే ఏడాది మొదట్లో మార్కెట్లో వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.