Begin typing your search above and press return to search.

షాక్ ..వ్యాక్సిన్ విఫలం ..ఇక దేవుడే దిక్కు !

By:  Tupaki Desk   |   20 May 2020 11:17 AM GMT
షాక్ ..వ్యాక్సిన్ విఫలం ..ఇక దేవుడే దిక్కు !
X
ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ఈ మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. ఎప్పుడు.. ఎలా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందోనని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనడానికి అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ విద్యాలయం ముందు వరసలో ఉన్నది. దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ విద్యాలయం ముందు వరసలో ఉన్నది. ఈ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు జరుగుతున్నాయి. బ్రిటన్ ప్రభుత్వం, ఆస్ట్రాజెనక అనే ఫార్మా కంపెనీతో ఒప్పందం చేసుకుంది.

ఈ ఒప్పందం ప్రకారం వ్యాక్సిన్ విజయవంతమైతే 30 మిలియన్ డోస్ లను ఉత్పత్తి చేయాలి. దీనికోసం ప్రభుత్వం 47 మిలియన్ పౌండ్లను వెచ్చిస్తోంది. అయితే, ఈ పరిశోధనలో భాగంగా విశ్వ విద్యాలయం తయారు చేసిన సిహెచ్ఏడి ఓఎక్స్ 1 ఎన్ అనే వ్యాక్సిన్ ను ఇటీవలే కోతులపై ప్రయోగించారు. అయితే కోతుల్లో ప్రయోగించిన ఈ మెడిసిన్ విఫలం అయ్యింది. కోతుల్లో కేవలం ఈ వ్యాక్సిన్ న్యుమోనియాను మాత్రమే అపగలిగింది గానీ.. మహమ్మారి సంక్రమణ తీవ్రతను తగ్గించలేకపోయింది. దీనితో ఈ వ్యాక్సిన్‌పై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఈ పరిశోధనలో భాగమైన వైరాలజీ ప్రొఫెసర్ జోనాథన్ బాల్ మాట్లాడుతూ… ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ వాస్తవానికి వైరస్ వ్యాప్తిని నిరోధించలేదు. వ్యాక్సిన్ ఇచ్చిన కోతుల్లోనూ, ఇవ్వని వాటిల్లోనూ వైరస్ లోడ్ ఒకేలా ఉందన్నారు. మానవులతో కూడా ఇదే జరిగితే ఈ వ్యాక్సిన్ వైరస్ వ్యాప్తిని ఆపలేదని స్పష్టం చేశారు. మనుషులపై ట్రయిల్స్ మొదలుపెట్టిన తర్వాతే ఈ మెడిసిన్ ‌పై పూర్తిగా క్లారిటీ వస్తుందని బాల్ సూచించారు. దీనితో పూర్తిస్థాయిలో వైరస్ ను అంతం చేయడానికి వ్యాక్సిన్ రావాలి అంటే ఎన్నేళ్లు పడుతుందో చూడాలి. అసలు వస్తుందా రాదా అనే డౌట్ కూడా చాలామందిలో ఉన్నది.