Begin typing your search above and press return to search.

టీకా మూడో డోసు బ్రహ్మాండమట

By:  Tupaki Desk   |   29 Jun 2021 6:30 AM GMT
టీకా మూడో డోసు బ్రహ్మాండమట
X
కరోనా వైరస్ విజృంభణ నేపధ్యంలో మొదటి డోసు వేసుకోవటమే కష్టంగా ఉంది. రెండో డోసంటే గగనమే అవుతోంది. మొదటిడోసు వేసుకున్న వాళ్ళు రెండో డోసు వేసుకోవటానికి నానా అవస్తలు పడుతున్న రోజులివి. అలాంటిది మూడో డోసు కూడా వేసుకుంటే చాలా మంచిదని శాస్ర్తజ్ఞులు మెల్లిగా చెబుతున్నారు. మూడో డోసు కూడా వేసుకుంటే శరీరంలో యాంటీబాడీస్ గణనీయంగా పెరిగిపోతోయనే విషయం తమ అధ్యయనంలో తేలిందంటు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటి తెలిపింది.

ఇంకో విచిత్రమేమిటంటే మొదటి డోసుకు రెండో డోసుకు మధ్య గ్యాప్ 45 వారాలుంటే చాలామంచిదట. ఇప్పటికే మొదటి రెండు డోసులకు మధ్య గ్యాప్ 16 వారాలకు కేంద్రప్రభుత్వం పెంచేసింది. టీకాల ఉత్పత్తి చేయలేక, అందరికీ టీకాలను సరైన సమయానికి వేయించలేకే కేంద్రం రెండు టీకాల మధ్య గ్యాప్ ను పెంచేస్తోందనే ఆరోపణలు అందరికీ తెలిసిందే.

అలాంటిది ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ లెక్క ప్రకారం గ్యాప్ 45 వారాలంటే రెండో డోసు వేసుకునే విషయలో జనాలకు అసలు ఇంట్రస్టే పోతుంది. 10 నెలల తర్వాత రెండో డోసు వేసుకున్న వాళ్ళని పరిశీలిస్తే తమ అధ్యయనంలో మంచి ఫలితాలున్నట్లు తేలిందంటున్నారు. ఇదంతా కోవీషీల్డ్ టీకాల విషయంలోనే సుమా. మిగిలిన టీకాల సంగతిని శాస్త్రజ్ఞులు ప్రకటించలేదు.