Begin typing your search above and press return to search.
ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ రేటు ఎంతో చెప్పేశారు
By: Tupaki Desk | 22 July 2020 4:45 AM GMTకరోనా పుణ్యమా అని యావత్ ప్రపంచం కారుచీకట్లో తల్లడిల్లిపోతూ..ఈ ఉత్పాతం నుంచి ఎలా బయటకు రావాలో అర్థం కాక కిందామీదా పడుతున్న సంగతి తెలిసిందే. ఈ మాయదారి రోగానికి చెక్ పెట్టే వ్యాక్సిన్ తయారీ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ ప్రయోగాల్లో ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ తయారు చేసిన వ్యాక్సిన్ సానుకూల ఫలితాలు వెల్లడి కావటమే కాదు.. కరోనాకు చెక్ పెట్టే తొలి వ్యాక్సిన్ గా భావిస్తున్నారు.
ఇప్పటికే రెండు దశల హ్యుమన్ ట్రయల్స్ ను దాటేసిన ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్.. ఇప్పుడు మూడో దశ పరీక్షకు వెళ్లింది. భారత్ లో ఈ వ్యాక్సిన్ ను సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేయనుంది. దీనికి సంబంధించిన ఒప్పందం గతంలోనే జరిగింది. తన తదుపరి పరీక్షల్ని భారత్ లోకూడా నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే.. ఇంతకూ ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ఎంత ధర ఉండే అవకాశం ఉందన్నది ప్రశ్నగా మారింది.
ఈ సందేహానికి సమాధానం చెప్పేశారు సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా. భారత్ లో ఈ వ్యాక్సిన్ ను కోవి షీల్డ్ పేరుతో ఉత్పత్తి చేస్తామని చెబుతున్నారు. భారత్ తో పాు అల్ప.. మధ్యసథాయి ఆదాయాలున్న అన్ని దేశాలకు ఫూణె లోని తమ యూనిట్ నుంచి కొవిషీల్డ్ పంపిణీ జరుగుతుందని చెప్పారు.
అతేకాదు.. ప్రపంచంలో తొలి వ్యాక్సిన్ ఆక్స్‌ఫర్డ్ దే అవుతుందన్ననమ్మకాన్ని వ్యక్తం చేశారు. వచ్చే నెలలో భారత్ లో తాము చేసే ప్రయోగ పరీక్షలో సత్ఫలితాలు ఇస్తే.. తొలి వ్యాక్సిన్ గా కోవి షీల్డ్ నిలుస్తుందని చెప్పిన ఆయన.. ఇందుకు అవసరమైన అనుమతులు కోరుతు ఈ వారంలోనే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేస్తున్నట్లు చెప్పారు.
తమ ఫూణె యూనిట్ నుంచి వంద కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని ఉత్పత్తి చేయనున్నట్లు చెప్పారు. దీనికిగాను బహుళజాతి ఫార్మా కంపెనీ ఆస్త్రాజెనెకాతో ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఏడాదిలో తాము వంద కోట్ల డోసులు ఉత్పత్తి చేయాలని భావిస్తున్నామని.. ఈ నవంబరు నాటికి 30 నుంచి 40 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేయగలమన్నారు. ప్రతి నెలా ఆరు కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని.. అందులో సగం భారత్ కే కేటాయిస్తామన్నారు. 2021 మార్చి నాటికి భారీ ఎత్తున వ్యాక్సిన్ ప్రజలకు చేరే వీలుందన్నారు. యావత్ దేశం మొత్తం వ్యాక్సిన్ చేరటానికి మాత్రం దగ్గర దగ్గర రెండేళ్లు పట్టే వీలుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.