Begin typing your search above and press return to search.
ప్రియాంక ఫైన్ కట్టక్కర్లేదు.. నేనే కడతా..
By: Tupaki Desk | 2 Jan 2020 4:30 AM GMTపౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలు.. ఆందోళనల నేపథ్యం లో అరెస్టు అయిన విశ్రాంత ఐపీఎస్ అధికారి ఎస్ ఆర్ దారాపురిని పరామర్శించేందుకు వెళుతున్న వేళ.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ టూవీలర్ మీద ప్రయాణించిన సంగతి తెలిసిందే. పోలీసులు ఆమె కారును అడ్డుకున్న వేళ.. ఆమె ఒక స్కూటర్ మీద ప్రయాణించిన వైనం దేశ వ్యాప్తం గా అందరిని ఆకర్షించింది. ఈ ఉదంతం లో టూవీలర్ యజమానికి అధికారులు భారీ జరిమానాను విధించారు.
వాహనాన్ని నడిపిన కాంగ్రెస్ నేత హెల్మెట్ పెట్టుకోకపోవటం.. ఇతరరత్రా కారణాలు చూపించి రూ.6100 ఫైన్ వేశారు. తాజాగా.. ఈ భారీ ఫైన్ ను తానే కడతానని స్కూటీ యజమాని స్పష్టం చేశారు. పోలీసులు విధించిన చలానాను కట్టేస్తానని చెప్పారు. స్కూటీ యజమాని తాజాగా మాట్లాడుతూ.. ఆ రోజు తాను పాలిటెక్నిక్ కాలేజీ వైపు స్కూటీ మీద వెళుతున్న వేళ ప్రియాంక.. ధీరజ్ గుర్జార్ లను చూశానని చెప్పారు.
ధీరజ్ తన వద్ద కు వచ్చి ప్రియాంక గాంధీ ని తీసుకెళ్లేందుకు మీ స్కూటీ ఇస్తారా? అని అడిగారని.. దాంతో కాదన లేకపోయినట్లు చెప్పారు. వారిద్దరూ స్కూటీ మీద హెల్మెట్ లేకుండా ప్రయాణించినందుకు రూ.6100 ఫైన్ వేశారని.. ఆ మొత్తాన్ని తానే కట్టేస్తానని చెప్పారు. ధీరజ్ కానీ.. ప్రియాంక కానీ ఆ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని.. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ఫైన్ కట్టనక్కర్లేదని స్పష్టం చేశారు. వారి నుంచి తాను ఎలాంటి డబ్బులు తీసుకోనని చెబుతున్న వాహన యజమాని మాటలు ఇప్పుడు ఆసక్తి కరంగా మారాయి. ఆ రోజు స్కూటీ తీసుకున్న అనంతరం కాంగ్రెస్ నేత ధీరజ్.. ప్రియాంక గాంధీలు రిటైర్డ్ఐపీఎస్ అధికారి ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు.