Begin typing your search above and press return to search.
బాబ్రీ మసీదు దానికదే కూలిపోయిందా: ఓవైసీ
By: Tupaki Desk | 30 Sept 2020 8:30 PM ISTబాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ వృద్ధ నేతలు అద్వానీ, జోషి, ఉమాభారతి సహా కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వారిని నిర్ధోషులుగా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొద్దిసేపటి క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం అవుతుండగా.. తాజాగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాత్రం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
బాబ్రీ మసీదు కూల్చివేతపై సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. అందరూ నిర్ధోషులు అయితే మసీదును ఎవరు కూల్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. బాబ్రీ మసీదు దానికి అదే కూలిపోయిందా అని ప్రశ్నించారు.
ఈ కేసులో ముస్లింలకు న్యాయం జరగలేదని అసదుద్దీన్ స్పష్టం చేశారు. ఇటు సీబీఐ కోర్టు తీర్పుపై ముస్లిం లా బోర్డు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ తీర్పుపై తాము సుప్రీం కోర్టులో అప్పీల్ చేస్తామని చెప్పింది.
కాగా 1992లో బాబ్రీ మసీదును ఓ అల్లరి మూక ధ్వంసం చేసింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ కురువృద్ధులపై ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 28 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పుతో వారికి ఊరట దక్కింది.