Begin typing your search above and press return to search.

అన్నీ పార్టీలు ముస్లింలను మోసం చేశాయంటున్న ఓవైసీ

By:  Tupaki Desk   |   11 Nov 2019 4:13 AM GMT
అన్నీ పార్టీలు ముస్లింలను మోసం చేశాయంటున్న ఓవైసీ
X
ఏళ్ల కు ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అయోధ్య వివాదం పై సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు పై తన స్పందన ను ఒక బహిరంగ సమావేశం లో వ్యక్తం చేశారు మజ్లిస్ అధి నేత అసదుద్దీన్ ఓవైసీ. బాబ్రీ మసీదు ఇప్పుడు కానీ ఉండి ఉంటే? ఎలాంటి తీర్పు వచ్చేది? అని ప్రశ్నించిన ఆయన.. బాబ్రీ మసీదు ఒకవేళ అక్రమ మైతే.. అద్వానీ తదితరులు ఎందుకు కూల్చివేశారన్నారు. ఒకవేళ సక్రమమే అయితే.. మసీదు ను ధ్వంసం చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు.

ఎవరైనా మీ ఇంటి ని ధ్వంసం చేస్తే.. మధ్య వర్తిగా ఉన్న వారు ధ్వంసం చేసిన వారికి ఆ స్థలాన్ని ఇచ్చేసి.. బాధితులైన మీకు వేరే స్థలాన్ని ఇస్తామని చెబితే మీకెలా ఉంటుంది? అంటూ హైదరాబాద్ లోని పాతబస్తీ లో ఏర్పాటు చేసిన సభలో ఉన్న వారిని అడిగిన తీరు పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సుదీర్ఘంగా సాగిన వాదోపవాదాలు.. ఆధారాలు.. చరిత్ర లాంటి వాటిని మర్చిపోయిన ఓవైసీ.. తన కోణంలో నుంచే అక్కసును ప్రదర్శించిన తీరు అభ్యంత రకరంగా ఉందన్న అభి ప్రాయం వ్యక్త మవుతోంది.

సుప్రీం కోర్టు సుప్రీమేనని చెబుతూనే.. తప్పులు చేయకుండా ఉంటుందా? అని ప్రశ్నించిన ఆయన.. తీర్పు విషయం లో తనకున్న అసంతృప్తి బయటపెట్టారు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయాన్ని చెప్పటం తప్పేమీ కాదన్న ఆయన.. బాబ్రీ మసీదు కూల్చిన వారితోనే ట్రస్టు ఏర్పాటు చేసి ఆలయాన్ని నిర్మించాలని సుప్రీం చెబుతుందన్నారు.

తీర్పు పట్ల తాము సంతృప్తిగా లేమన్న ఓవైసీ.. రాజ్యాంగంపై తమకు నమ్మకం ఉందని.. తమకున్న చట్టబద్ధమైన హక్కు కోసం తాము పోరాడతామన్నారు. తమకు ఎవరి భిక్ష అవసరం లేదన్న ఆయన.. మసీదు కోసం ఐదు ఎకరాల స్థలాన్ని రిజెక్టు చేయాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు ఐదు ఎకరాల స్థలాన్ని తీసుకోవటానికి అంగీకరించదని తాను భావిస్తున్నట్లు చెప్పారు.

బాబ్రీ మసీదును కూల్చి వేశారు కాబట్టి ఆలయ పనులు ప్రారంభించాలని చెబుతున్నారని.. ఒకవేళ బాబ్రీ మసీదు ఉండి ఉంటే.. ఎలాంటి తీర్పు వచ్చేది? అని ప్రశ్నించారు. దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చే దిశగా వెళ్తున్నారని.. ఈ తీర్పును అందుకోసం ఉపయోగించుకుంటున్నట్లు చెప్పారు.

ముస్లింలను కాంగ్రెస్ తో సహా అన్ని రాజకీయ పార్టీలు మోసం చేసినట్లుగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో వివక్ష కు గురి అవుతున్న ముస్లింలు పేదరికం లో ఉండి ఉండొచ్చు కానీ మసీదు నిర్మాణం కోసం స్థలాన్ని కొనలేనంత బీదరికంలో లేరని.. ఈ రోజు తాను హైదరాబాద్ రోడ్లపై అడుక్కుంటే యూపీ లో ఐదు ఎకరాల స్థలం కొనే దాని కంటే ఎక్కువ డబ్బులు వస్తాయని వ్యాఖ్యానించారు.

500 ఏళ్లుగా అక్కడో మసీదు ఉండేదని.. కాంగ్రెస్ కుట్ర.. సంఘ్ పరివార్ వల్ల తాము ఆ మసీదును కోల్పోయామని.. వాళ్లు సుప్రీం కోర్టు ను కూడా తప్పుదారి పట్టించారని తమ భవిష్యత్ తరాల వారికి చెబుతామన్నారు. తీర్పు రాజ్యాంగాని కి లోబడి ఉందా? అని ప్రశ్నించారు.

1949లో వివాదాస్పద స్థలం లో శిల్పాలను ఏర్పాటు చేయించి పూజలు నిర్వహించటాని కి కాంగ్రెస్ పార్టీనే కారణమన్న ఓవైసీ.. రాజీవ్ హయాంలోనే బాబ్రీ మసీదు తాళాలు తీసి పూజలకు అనుమతించారన్నారు. పీవీ ప్రభుత్వం రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించి ఉంటే.. బాబ్రీ మసీదును ధ్వంసం చేసే అస్కారమే ఉండేది కాదన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయం తోనే వివాదం ఏర్పడిందన్నారు.

అయోద్య పై సుప్రీం తీర్పు నేపథ్యం లో తమ జాబితాలో మరే కట్టడాలు లేవన్న మాటే నిజమైన పక్షంలో కాశీ.. మధుర మసీదుల విషయంలో తాము దాఖలు చేసిన కేసుల్ని ఎందుకు వెనక్కి తీసుకోవటం లేదని ప్రశ్నించారు. సుప్రీం తీర్పు తో ముస్లింలు ఆవేదన చెందొద్దన్న అర్థం వచ్చేలా కామెంట్ చేసిన ఓవైసీ వ్యాఖ్యలు చూస్తే.. తన బాధ లోకం బాధ అన్నట్లుగా ఉందని చెప్పక తప్పదు. 134 ఏళ్లుగా సాగుతున్న వివాదానికి పుల్ స్టాప్ పెట్టేలా సుప్రీం నిర్ణయం తీసుకున్న వేళ.. యావత్ దేశం మొత్తం హర్షం వ్యక్తమవుతుంటే.. అందుకు భిన్నంగా ఓవైసీ వ్యాఖ్యలు అభ్యంతరకరం గా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది.