Begin typing your search above and press return to search.

తాటాకు చప్పుళ్ళు కావు.. నిప్పుల పిడుగులు

By:  Tupaki Desk   |   23 Nov 2022 10:36 AM GMT
తాటాకు చప్పుళ్ళు కావు.. నిప్పుల పిడుగులు
X
ఆదాయపు పన్నుల శాఖ టీయారెస్ మంత్రి మల్లారెడ్డి నివాసాలు. ఆఫీసులు, కాలేజీలలో వరసబెట్టి చేస్తున్న దాడులను చూసి టీయారెస్ నేతలు తాటాకు చప్పుళ్ళు అంటున్నారు. స్వయంగా దాడుల బాధితుడు అయిన మంత్రి మల్లారెడ్డి కూడా ఇలాంటి వాటికి తాము బెదిరేది లేదు అని సౌండ్ చేస్తున్నారు. కానీ చాలా పకడ్బంధీగా జరుగుతున్నా పరిణామాలు చూస్తే కనుక ఇవి నిప్పుల పిడుగులు తప్ప తాటాకు చప్పుళ్ళు కానే కావని అంటున్నారు.

ఈ దాడులను తాము ముందే ఊహించామని, ధీటుగా ఎదుర్కొంటామని మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్ తో పాటు మల్లారెడ్డి వంటి వారు చెబుతున్నారు. మరి ముందే ఈ దాడులను ఊహిస్తే మల్లారెడ్ది ఇంట్లో అంత నగదు ఎలా పట్టుబడింది అన్నది కూడా పాయింటే కదా. అదే విధంగా ఈ దాడులను మేము సమర్ధంగా ఎదుర్కొంటామని చెబుతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తున్న దాడులను ఎలా ఎదుర్కొంటారో చెప్పలేక ఈ రకంగా గాంభీర్యమైన మాటలు వాడుతున్నారని అంటున్నారు.

ఒక వైపు చూస్తే ఢిల్లీలో లిక్కర్ స్కాం బయటకు వచ్చింది. ఆ లింకులు డొంకలు ఆలా దాడుల పర్వం సాగుతుండగానే ఆ తరువాత శరవేగంగా టీయారెస్ మంత్రుల మీద ఐటీ ఈడీ దాడులు జరుగుతున్నాయి. నిన్న గాక మొన్న మరో మంత్రి గంగుల కమలాకర్ నివాసాలు ఆఫీసుల మీద గ్రానైట్ వ్యాపారానికి సంబంధించిన లొసుగులు ఉన్నాయని దాడులను ఈడీ చేసింది. అదే విధంగా ఐటీ ఈడీ దాడులు కూడా పరిపాటిగా మారిపోయాయి.

టీయారెస్ నేతల మీద ఈ దాడుల జాబితా చాలానే ఉంది అని అంటున్నారు. దీని మీదనే నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దాడులను ఎదుర్కొంటామని చెబుతున్నారు, కేంద్రం కక్ష సాధింపు రాజకీయం అంటున్నారు. మరి దాడులలో దొరికిన సొమ్ముల గురించి మాత్రం ఎక్కడా చెప్పడంలేదేమీ అని అడుగుతున్నారు. నిజంగా చూస్తే ఎంత కక్ష సాధింపు అయినా కూడా ఏమీ లేని చోట ఎవరూ పట్టుకోలేరు కదా. పైగా ప్రతిష్ట కలిగిన కేంద్ర దర్యాప్తు సంస్థలు ఊరికే దాడులు చేసి తమ పరువు తీసుకోవు కదా.

కచ్చితమైన సమాచారంతోనే దాడులు చేస్తున్నారు అని అంటున్నారు. అవి రాజకీయ ప్రేరేపితమైన దాడులు అయితే కావచ్చు కానీ దొరికిన సొమ్ములకు మాత్రం బాధ్యత ఇవతల వారు వహించక తప్పదు అని కూడా అంటున్నారు. మొత్తానికి టీయారెస్ లో అతి పెద్ద చర్చగా ఈ దాడులు ఉన్నాయి. కేంద్రం మీద విరుచుపడి సిం హ గర్జన చేసిన కేసీయార్ ఈ కేలక సమయంలో మౌన ముద్ర దాల్చడం దాడుల కంటే కూడా మంత్రులను ఇతర నేతలను భయపెడుతోందిట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.