Begin typing your search above and press return to search.

ఓవర్ టు పవన్ : అంబటి ఆరోపణలు వెనుక ఉద్దేశం ఇదే !

By:  Tupaki Desk   |   25 April 2022 3:44 AM GMT
ఓవర్ టు పవన్ : అంబటి ఆరోపణలు వెనుక ఉద్దేశం ఇదే !
X
ప‌వ‌న్ ను ఉద్దేశించి చాలా మాటలు అన్నారు ఇవాళ జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు. తాను త్వ‌ర‌లో నారా వారి ద‌త్త పుత్రుడు పేరిట కానీ బాబు గారి ద‌త్త పుత్రుడు పేరిట కానీ సినిమా తీస్తాన‌ని వ్యంగ్య రూపంలో ఓ మాట అన్నారు. అయితే ఇందుకు ఐదుగురు హీరోయిన్లు కావాల్సి ఉంటుందంటూ మ‌రో వ్యంగ్యం వ్యాఖ్య చేశారు.

ఇవే ఇప్పుడు ఏపీ లో హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. ప‌వ‌న్ మాత్ర‌మే కాదు తాను కూడా స్క్రీన్ ప్లే రాయ‌గ‌ల‌న‌న్న ధోర‌ణిలో మాట్లాడారు. ఎందుక‌ని అంబ‌టి రాంబాబు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఎందుక‌ని ఒక మంత్రి త‌రువాత ఒక మంత్రి మీడియా ముందుకు వ‌చ్చి జ‌న‌సేనానిని తిడుతున్నారు? వీటి వెనుక వైసీపీ పెద్ద‌ల వ్యూహం ఏంటి అన్న‌ది ఈ క‌థ‌నంలో చూద్దాం.

వాస్త‌వానికి ఎప్ప‌టి నుంచో జ‌న‌సేన ను తిట్టేందుకు అంబ‌టి రాంబాబు అత్యంత ఆస‌క్తితో ఉన్నార‌న్నది ప‌వ‌న్ అభిమానుల మాట.ఆ విధంగా త‌మ అధినేత మంచి చేస్తే ఓర్వ‌లేకే తిడుతున్నార‌ని కూడా అంటున్నారు. తాము కౌలు రైతుల గురించి మాట్లాడినా, లేదా ఇతర ప్ర‌జా స‌మ‌స్య‌ల గురించి మాట్లాడినా పాలక ప‌క్షాల‌కు కోపాలు త‌న్నుకువ‌స్తున్నాయ‌ని, వాటి వ‌ల్ల ఏం ఉప‌యోగం లేద‌ని, ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తేనే మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌ని హిత‌వు చెబుతోంది.ఇక సీబీఐ కి జ‌గ‌న్ ద‌త్త పుత్రుడు అన్న మాట ఒక్క‌టి వినిపిస్తే చాలు అంబ‌టి ప్ర‌తిసారి మీడియా ముందుకు వ‌చ్చి ప‌వ‌న్ ను తిడుతున్నారు అని ఇది స‌బ‌బు కాద‌ని, త‌మ అధినేతను ఉద్దేశించి మాట్లాడిన‌ప్పుడు గ‌తంలో చేసిన త‌ప్పిదాలు అన్న మాట‌లు అన్నింటినీ ఓ సారి పున‌రావ‌లోకనం చేసుకోవాల‌ని కూడా అంటోంది.

ఇక ఈ వ్యాఖ్య‌ల‌కు సంబంధించి పూర్వ‌ప‌రాలు ఆరా తీస్తే.. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో పేర్నినాని కూడా ఇలానే ప‌వ‌న్ ను తిట్టారు. మంత్రులు కేవలం ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పైనే దృష్టిసారించాలి కానీ ఎందుక‌ని ఈ విధంగా వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు ప్రాధాన్యం ఇస్తూ అధినాయక‌త్వం మెప్పు పొందేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నార‌ని ? అన్న‌ది కూడా ఇవాళ విప‌క్షం నుంచి వ‌స్తున్న ప్ర‌శ్న.

జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి హోదాలో ఉన్న ఆయ‌న గ‌తంలో అనిల్ మాదిరిగానే మాట్లాడ‌డం ఇవాళ మ‌రో చ‌ర్చ‌కు తావిస్తోంది.కీల‌క శాఖ నిర్వాహ‌కుడి గా ఉంటూ ప్రాజెక్టుల పురోగ‌తిని ప‌ట్టించుకోకుండా, కేవ‌లం వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు ప‌రిమితం అవుతూ ఇత‌ర పార్టీల నాయ‌కులను ఇష్టం వ‌చ్చిన విధంగా విమ‌ర్శించ‌డం త‌గ‌ద‌ని జ‌న‌సేన మ‌రో సారి హిత‌వు చెబుతోంది. ఇదే స‌మ‌యంలో వైసీపీ వెర్ష‌న్ లో మ‌రో విధంగా ఉంది.

గ‌తంలో ప‌వ‌న్ త‌నను రాంబో రాంబాబు అన్నారు అని అదెలా మ‌రిచిపోతానని అంటున్నారు. అంటే నువ్వు ఒక‌టి అంటే నేను నాలుగు అంటాను అన్న విధంగానే ఇరు పార్టీల నేత‌ల‌కూ కొట్లాటే ప్రాధాన్య‌మా ? లేదా ప్ర‌జా స‌మ‌స్యల ప‌రిష్కార‌మే ధ్యేయ‌మా? తాము గ‌ణాంకాల‌తో స‌హా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మాట్లాడితే వాటికి క‌దా ఆన్స‌ర్ ఇవ్వాలి .. కానీ గౌర‌వ మంత్రి వ‌ర్యులు విష‌యం మ‌రిచి స్థాయి విడిచి మాట్లాడ‌డంతోనే వాగ్యుద్ధాలు జ‌రుగుతున్నాయి అని జ‌న‌సేన అంటోంది. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు కాకుండా రాజ‌కీయం హుందాగా న‌డ‌పడం ఇరు పార్టీల‌కూ ఇవాళ ఎంతో ఆవ‌శ్య‌కం. పాటిస్తారా ? సంయ‌మ‌నాన్ని !