Begin typing your search above and press return to search.
రైళ్లలో రేప్ లు.. షాకింగ్ నంబర్స్!
By: Tupaki Desk | 3 March 2020 6:00 AM ISTదేశంలో స్త్రీకి రక్షణ ఎక్కడ? అంటే.. ఈ విషయంలో భరోసాగా ఏ ప్లేస్ నూ చెప్పలేని పరిస్థితి. అమ్మాయిలను, మహిళలను వేధించడానికి వీలుకాని చోటంటూ ఏదీ లేకుండా పోయినట్టుగా ఉంది. మహిళలపై ఏదో రకమైన లైంగిక వేధింపులు జరిగే చోట్లలో రైళ్లు కూడా చేరి చాలా కాలమే అయి ఉంటుంది. మెట్రోళ్లో, ఇతర రైళ్లలో లైంగిక వేధింపులకు సంబంధించిన ఘటనలు తరచూ వార్తల్లోకి వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో 2017-19 సంవత్సరాల మధ్యన భారతీయ రైళ్లలో మహిళలపై చోటు చేసుకున్న లైంగిక వేధింపుల గురించి ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని సేకరించారు ఒక కార్యకర్త.
రైళ్లలో కూడా మహిళల పై బోలెడన్ని లైంగిక వేధింపులు చోటు చేసుకున్నాయని, వాటికి సంబంధించి కేసులు కూడా చాలానే నమోదు అయ్యాయని ఆర్టీఐ ద్వారా బయటకు వచ్చింది. రైల్వే సరిసరాల్లో రెండేళ్ల లో చోటు చేసుకున్న అత్యాచారాల సంఖ్య 160 కావడం గమనార్హం.
ఈ కేసులన్నీ రైల్వే పోలిస్ స్టేషన్లలో నమోదు అయినవే! కదులుతున్న రైలులో లేదా, రైల్వే స్టేషన్ పరిసరాలు, రైల్వే శాఖకు సంబంధించిన స్థలాల్లోనే రెండేళ్లో ఏకంగా 160 అత్యాచారాలు జరిగినట్టుగా కేసులు నమోదు అయ్యాయట! అదే ఇతర వేధింపుల సంఖ్య అయితే మరింత గణనీయంగా ఉంది. అత్యాచారాలు కాకుండా మరో 1,672 లైంగిక వేధింపుల కేసులు నమోదు అయ్యాయని రైల్వే శాఖ సమాచారం ఇచ్చింది. వీటిలో 870 కేసులు కదులుతున్న రైళ్లలో చోటు చేసుకున్న లైంగిక వేధింపులకు సంబంధించినవి.
అదే దొంగతనాల విషయానికి వస్తే ఆ సఖ్య మరింత గణనీయంగా ఉంది. మూడు సంవత్సరాల వ్యవధిలో 4,718 దొంగతనం కేసులు నమోదు అయినట్టుగా భారతీయ రైల్వే తెలిపింది.