Begin typing your search above and press return to search.

మన పాలన దేశానికే ఆదర్శం కావాలి

By:  Tupaki Desk   |   8 Jun 2019 11:27 AM IST
మన పాలన దేశానికే ఆదర్శం కావాలి
X
ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్.వోడీలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ముఖ్య సలహాదారు అజయ్ కల్లం, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వ అధికారులు పూర్తి అవగాహనతో పూర్తి చేసి సహకరించాలని.. అనవసర వ్యాయన్ని తగ్గించాలని కోరారు.మన పాలన దేశానికే ఆదర్శంగా ఉండాలని దిశానిర్ధేశం చేశారు. బాగా పనిచేసిన అధికారులకు సన్మానాలు, సత్కారాలు చేస్తామన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని.. అధికారులు సహకరిస్తే ప్రజల-ప్రభుత్వ కల సాకారం అవుతుందని పేర్కొన్నారు. అధికారులపై తనకు పూర్తి విశ్వాసముందని తెలిపారు. అవినీతికి ఆస్కారం లేని పారదర్శక పాలన అందించడానికి తాను ధృడ సంకల్పంతో ఉన్నట్లు పేర్కొన్నారు. అవినీతిని నిర్మూలించి ప్రభుత్వ నిధులు ఆదా చేయాలని అధికారులకు సూచించారు.

హైకోర్టు చీఫ్ జస్టిస్ ను కలిసి జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వ పనులు, కాంట్రాక్టులు అన్ని పారదర్శకంగా జరిగేలా చేయాలని కోరానని.. ఇది దేశంలో ఎక్కడా జరగడం లేదని జగన్ అధికారులకు వివరించారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతిభావంతులైన అధికారుల సమాహారం ఉందని.. సీఎం ఆశయాలకు అనుగుణం వారంతా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని జగన్ కు వివరించారు.