Begin typing your search above and press return to search.

షాక్: మ‌న ఆయుష్షు త‌గ్గి ఎందుకు మ‌ర‌ణిస్తున్నామంటే

By:  Tupaki Desk   |   29 July 2020 1:30 AM GMT
షాక్: మ‌న ఆయుష్షు త‌గ్గి ఎందుకు మ‌ర‌ణిస్తున్నామంటే
X
ఓ వైపు క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతుంటూ మ‌రో దుర్వార్త తెరమీద‌కు వ‌చ్చింది. మ‌నుషుల ప్రాణాలు ఎంత ప్ర‌మాదంలో స్ప‌ష్ట‌మయింది. ముఖ్యంగా మ‌న దేశంలో నివ‌సిస్తున్న వారి గురించి సంచ‌ల‌న విష‌యం ఇది. వాయు కాలుష్యం కారణంగా భారతీయుల సగటు ఆయుర్దాయం 5.2 ఏళ్లు తగ్గిపోతోందని చికాగో విశ్వవిద్యాలయంలోని ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్ (ఈపీఐసీ) ఉత్పత్తి చేసిన ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ (ఎక్యూఎల్ఐ) తాజా విశ్లేషణ స్ప‌ష్టం చేసింది. మరే దేశంలోనూ కనిపించని కాలుష్య స్థాయికి భారతదేశ జనాభాలో నాలుగింట ఒకవంతు మంది గురవుతున్నారని ఈ స‌ర్వేలో స్ప‌ష్టమైంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మార్గదర్శకాలు, దేశంలోని ప‌రిణామాల‌ను ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ (ఎక్యూఎల్ఐ) విశ్లేషించింది. గాలిలో క్యూబిక్ మీటర్‌కు పీఎం 2.5 (కాలుష్య కారమైన రేణువులు)10 మైక్రాన్లకు మించకూడదు. అలాగే, పీఎం10 క్యూబిక్ మీటరుకు 20 మైక్రాన్లకు దాట‌కూడదు. కానీ భార‌త‌దేశంలో సీన్ భిన్నంగా ఉంది. 2018లో ఇండియాలో సగటున పీఎం 2.5 క్యూబిక్ మీటరుకు 63 మైక్రాన్లుగా నమోదైంది. ఆయా ప్రాంతాల వారీగా చూస్తే ఢిల్లీ, ల‌క్నో వంటి ప్రాంతాలు డేంజ‌ర్ జోన్లో ఉన్నాయి. డబ్ల్యూహెచ్ఓ నిర్దేశించిన మార్గదర్శకాల కంటే లక్నోలో కాలుష్యం 11 రెట్లు అధికంగా ఉంది. ఇది ఇలాగే కొనసాగితే లక్నోవాసులు 10.3 సంవత్సరాల ఆయుర్దాయాన్ని కోల్పోతారని పేర్కొంది. ఢిల్లీలో కాలుష్యాన్ని కనుక తగ్గించగలిగితే ఆయుర్దాయం మరో 9.4 సంవత్సరాలు పెరిగే అవకాశం ఉంది.

భార‌త దేశంలోని 1.4 బిలియన్ల మంది ప్రజలు ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు మించిన వార్షిక సగటు పరమాణు కాలుష్య ప్రాంతాల్లో నివసిస్తున్నారన ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ (ఎక్యూఎల్ఐ) తాజా విశ్లేషణ స్ప‌ష్టం చేసింది. మ‌న దేశ‌ జనాభాలో నాలుగింట ఒకవంతు మంది మరే దేశంలోనూ కనిపించని కాలుష్య స్థాయికి గురవుతున్నారని ఈ నివేదిక తేల్చి చెప్పింది. 1998 నుంచి సగటు వార్షిక పరమాణు కాలుష్యం 42 శాతం పెరిగిందని పేర్కొంటూ ఆ సంవత్సరాల్లో సగటు నివాసి జీవితకాలాన్ని 1.8 సంవత్సరాలు తగ్గిస్తుంద‌ని నివేదిక వివరించింది. కాలుష్య స్థాయులు ఇలాగే కొనసాగితే ఉత్తర భారతదేశంలో 248 మిలియన్ల మంది 8 సంవత్సరాల కన్నా ఎక్కువ ఆయుర్దాయాన్ని కోల్పోతారని స్ప‌ష్టం చేసింది. డబ్యూహెచ్ఓ ప్రమాణాల ప్రకారం ఉంటే వాతావ‌ర‌ణంలో గాలి ల‌భ్యత ఉంటే, బీహార్‌ వాసులకు ఏడేళ్లు, హర్యానా వాసులకు 8 ఏళ్ల ఆయుర్దాయం పెరుగుతుందని నివేదిక పేర్కొన‌డం ప‌రిస్థితికి అద్దం ప‌డుతోంది.