Begin typing your search above and press return to search.

మ‌న డ్రైవింగ్ లైసెన్స్‌ తో ఈ దేశాల్లో దున్నేయ‌చ్చు

By:  Tupaki Desk   |   12 Jun 2016 4:52 PM GMT
మ‌న డ్రైవింగ్ లైసెన్స్‌ తో ఈ దేశాల్లో దున్నేయ‌చ్చు
X
విదేశీ టూర్ల‌కు వెళ్లిన‌పుడు అక్కడి విశాల‌మైన రోడ్ల‌పై ఝామ్మంటూ డ్రైవింగ్ చేయాలంటూ అనేక‌సార్లు మ‌న‌సు లాగేస్తుంటుంది. అయితే అక్క‌డి చ‌ట్టాలు - లైసెన్సులు - ప‌ట్టుబ‌డితే ఎలా అనే భ‌యం వీట‌న్నింటితో మ‌న కోరిక‌ను అక్క‌డితో ఆపేసుకుంటాం. కానీ ప్ర‌పంచంలోని అతిపెద్ద‌ - ప్ర‌ముఖ దేశాల్లో మెజార్టీ చోట్ల ఇండియా డ్రైవింగ్ లైసెన్స్‌ తోనే దున్నేయ‌చ్చు తెలుసా? ఇంత‌కీ ఆ దేశాలేవీ అనే క‌దా మీ సందేహం! చ‌దివేయండి మ‌రి.

అమెరికా - యునైటెడ్ కింగ్‌ డం - జ‌ర్మ‌నీ - నార్వే - స్విట్జ‌ర్లాండ్‌ - ఆస్ర్టేలియా - ఫ్రాన్స్‌ - ఉత్త‌ర కొరియా - ఫిన్లాండ్ దేశాల్లో మ‌న డ్రైవింగ్ లైసెన్స్‌ తోనే ఎంచ‌క్కా షికార్లు చేసేయ‌చ్చు. అయితే ఈ దేశాల్లో ప‌రిమిత స‌మ‌యం వ‌ర‌కు మాత్ర‌మే మ‌న డ్రైవింగ్ లైసెన్స్‌ ను ఉప‌యోగించుకోవాల్సి ఉంటుంది. ఆయా దేశాల‌ను బ‌ట్టి ఈ స‌మ‌యం ఆధారప‌డి ఉంటుంది. ఆయా దేశాల‌తో కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు సంద‌ర్భాల్లో కుదుర్చుకున్న ఒప్పందాల వ‌ల్ల ఈ సౌల‌భ్యం సాధ్య‌మ‌యింది.

అయితే ఈ సౌల‌భ్యాన్ని ఎంజాయ్ చేసే స‌మ‌యంలో ఒరిజిన‌ల్ డ్రైవింగ్ లైసెన్స్ వెంట ఉంచుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. జిరాక్స్ ప‌త్రాల‌ను అంగీక‌రించరు. ఇక స్వ‌ల్ప స‌మ‌యానికే ఈ లైసెన్స్‌కు వాలిడిటీ ఉన్న నేప‌థ్యంలో పూర్తిస్థాయిగా డ్రైవింగ్ అనుభూతిని ఎంజాయ్ చేయాలంటే సంబంధిత దేశం లేదా అంత‌ర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌ ను వెంట ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇంతే కాకుండా ఆయా దేశాల‌కు చెందిన ర‌వాణా నిబంధ‌న‌ల‌ను తెలుసుకొని ఉండటం - లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ వంటి వాటిల్లో అవ‌గాహ‌న క‌లిగి ఉండ‌టం వ‌ల్ల ఆ ప్ర‌యాణాన్ని మ‌రింత‌గా ఆస్వాదించ‌వ‌చ్చు. పొరుగుదేశాల్లో స‌మ‌స్య‌లు తెచ్చుకోకుండా డ్రైవింగ్ మ‌జాను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. ఏమంటారు?