Begin typing your search above and press return to search.

ఇండియాలో పొరుగు దేశాల కరెన్సీ హల్ చల్

By:  Tupaki Desk   |   19 Nov 2016 4:00 AM IST
ఇండియాలో పొరుగు దేశాల కరెన్సీ హల్ చల్
X
ఈశాన్య రాష్ట్రాలు - పశ్చిమ బెంగాల్ కు పొరుగున ఉన్న దేశాలు మన కంటే చిన్నవి కావడం... అక్కడ జీవనం - వ్యాపార కార్యకలాపాలు ఇండియాతో ముడిపడి ఉన్నవి కావడంతో ఇంతకాలం అక్కడ మన కరెన్సీ సులభంగా చెల్లుబాటయ్యేది. ముఖ్యంగా నేపాల్ - భూటాన్ - బంగ్లాదేశ్ - బర్మాల్లో మన కరెన్సీ అక్కడి కరెన్సీ మాదిరిగానే చెల్లుబాటవుతుంది. మన రూపాయిని ఆ దేశాల్లోని సగం ప్రాంతాల్లో యాక్సెప్ట్ చేస్తారు. అలాగే మన దేశంలోనూ ఆయా దేశాలతో సరిహద్దు ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఆయా దేశాల కరెన్సీ నడుస్తుంది. అయితే... ఇప్పుడు మన దగ్గర నగదుకు డిమాండు పెరిగిన నేపథ్యంలో సీను రివర్సయింది. మన ప్రాంతాల్లో ఆయా దేశాల కరెన్సీ వాడకం ఒక్కసారిగా పెరిగిపోయింది. ముఖ్యంగా అస్సాం - బెంగాల్ - అరుణాచల్ ప్రదేశ్ - సిక్కిం - మిజోరాం - నాగాలాండ్ - మణిపూర్ రాష్ట్రాల్లోని అంతర్జాతీయ సరిహద్దు ఉన్న ప్రాంతాల్లో నేపాల్ - భూటాన్ - బంగ్లాదేశ్ - బర్మా కరెన్సీలు బాగా చెలమణీలోకి వచ్చాయి.

అయితే.. పాక్ - చైనా సరిహద్దుల్లో మాత్రం అక్కడి కరెన్సీల వాడకం లేదు. ఇంతకుమునుపూ ఆ దేశాల కరెన్సీ ప్రభావం లేదు. ఇప్పుడూ ఆ ప్రభావం కనిపించలేదు. మిగతా రాష్ట్రాల్లో మాత్రం పొరుగు నోట్లు పెద్ద సంఖ్యలో చలామణీలోకి వచ్చాయి.

- జమ్ముకశ్మీర్ - పంజాబ్ - రాజస్థాన్ - గుజరాత్ లకు పాక్ సరిహద్దు ఉంది... చైనాతో సరిహద్దును జమ్ముకశ్మీర్ - హిమాచల్ ప్రదేశ్ - ఉత్తరాఖండ్ - సిక్కిం - అరుణాచల్ ప్రదేశ్ లు పంచుకుంటున్నాయి. కానీ.. ఆ రెండు దేశాల కరెన్సీ ప్రభావమేమీ లేదు.

- ఇక నేపాల్ తో సరిహద్దు ఉన్న బిహార్ - ఉత్తరాఖండ్ - ఉత్తర్ ప్రదేశ్ - సిక్కిం - పశ్చిమ బెంగాల్ లోని సరిహద్దు గ్రామాలు - సమీప పట్టణాల్లో నేపాలీ నోట్లు ఎక్కువయ్యాయి.

- బంగ్లాదేశ్ తో పశ్చిమ బెంగాల్ - మిజోరాం - మేఘాలయ - త్రిపుర - అస్సాంలకు సరిహద్దు ఉంది. ఈ ప్రాంతాలంతా బంగ్లా టాకాల వినియోగం బాగా పెరిగింది.

- ఇండియా నుంచి భూటాన్ లోకి వెళ్లే ప్రధాన మార్గమైన జైగావ్(పశ్చిమబెంగాల్) లో అయితే మొత్తం భూటాన్ కరెన్సీయే నడుస్తోందట. దీంతోపాటు సరిహద్దుల్లోని అలీపుర్ దార్ - కూచ్ బిహార్ - నాగ్రకాటా.. అస్సోంలోని బొంగైగావ్

- కోక్రాఝార్ లే కాకుండా రాజధాని ప్రాంతంలోని గౌహతి.. మరో ప్రధాన ప్రాంతం తేజ్ పూర్ వరకు భూటాన్ కరెన్సీ పాకేసిందట. అరుణాచల్ ప్రదేశ్ లోనూ తవాంగ్ వంటి ప్రాంతాల్లో భూటాన్ కరెన్సీ కమ్మేసిందట.

- మయన్మార్ తో సరిహద్దు ఉన్న అరుణాచల్ ప్రదేశ్ - నాగాలాండ్ - మణిపూర్ - మిజోరాం ప్రాంతాల్లోని సరిహద్దు ఏరియాల్లోనూ బర్మా కరెన్సీ క్యాత్ వ్యాప్తిలోకి వచ్చింది.

సాధారణంగా అయితే... బర్మా సరిహద్దుల్లో కరెన్సీ తేడా ఉంటుంది. మన రూపాయికి సరిపడా 20 క్యాత్ లు తీసుకుంటారు. కానీ... మన దగ్గర కరెన్సీ ట్రబుల్ ఉండడంతో రూపాయికి 10 క్యాత్ ల లెక్కనైనా ఇండియన్ దుకాణదారులు తీసుకుంటున్నారట.

నేపాలీ రూపాయికి మన రూపాయికి ఎప్పుడూ పెద్ద తేడా లేదు. 25 నుంచి 30 శాతం మధ్య తేడా ఉంటున్నా దాదాపుగా ఒకే వేల్యూకి వాడేస్తుంటారు.

ఇక భూటాన్ కరెన్సీ గుల్ట్రామ్ అయితే అప్పుడుఇప్పుడూ సేమ్ వేల్యూతోనే చెల్లుబాటు అవుతోంది.

బంగ్లాదేశ్ టాకాలకు మనకు వ్యత్యాసం స్వల్పమే. దాంతో అప్పుడు ఇప్పుడు కూడా అదే వేల్యూకి దాన్ని వినియోగిస్తున్నారు.

మరోవైపు అంతర్జాతీయ సరిహద్దు ఉన్న ప్రాంతాల్లో బ్యాంకు శాఖలు చాలా తక్కువ... 30 నుంచి 40 కిలోమీటర్ల పరిధికి ఒక శాఖ ఉంటుంది. ఏటీఎంలు అయితే ఇంకా తక్కువ. పలు ప్రాంతాలకు ఎస్బీఐ వంటి పెద్ద బ్యాంకుల వ్యాన్లు వచ్చి లావాదేవీలు జరుపుతాయి. డిపాజిట్లు - విత్ డ్రాలు అన్నీ అప్పుడే. దీంతో ఈ ప్రాంతాల్లో పొరుగు దేశాల కరెన్సీలూ వాడుతారు. ఇప్పుడు అది మరింత ఎక్కువైంది.

- గరుడ

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/