Begin typing your search above and press return to search.

భారత్ ఆస్కార్ అవార్డు: ఎవరెవరికో దక్కాయో చూడండి

By:  Tupaki Desk   |   12 Feb 2020 8:00 PM IST
భారత్ ఆస్కార్ అవార్డు: ఎవరెవరికో దక్కాయో చూడండి
X
ఇటీవల హాలీవుడ్‌లో ఆస్కార్ అవార్డులు ప్రకటించారు. ప్రతియేటా ఇచ్చే అవార్డులు ఈసారి కూడా ప్రకటించారు. అయితే భారత్ లో కూడా ఆస్కార్ అవార్డులు వచ్చాయి. ఆ అవార్డులను కాంగ్రెస్ పార్టీ ఇస్తోంది. సమకాలీన రాజకీయాలపై ఆ పార్టీ వ్యంగ్యంగా పేర్కొంటూ బీజేపీ నాయకులతో పాటు పలువురికి వివిధ అంశాల్లో ఆస్కార్ అవార్డును ప్రకటించింది. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ఫిబ్రవరి 10వ తేదీన ఈ అవార్డులను కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. దేశ రాజకీయాల్లో ఆస్కార్ అవార్డులు వీళ్లకేనంటూ చెబుతూ పలు వీడియోలు విడుదల చేసింది. కొంతమంది నేతలను పలు విభాగాల్లో నామినేట్ చేస్తూ.. ఆస్కార్ అవార్డులతో సత్కరించింది.

అవార్డులు వీరికే..

బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ రోల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
నామినీస్ లిస్టు- ప్రగ్యా ఠాకూర్, యోగి ఆదిత్యనాథ్

బెస్ట్ యాక్టర్ ఇన్ నెగటివ్ రోల్: అమిత్ షా
నామినీస్ : అనురాగ్ ఠాకూర్, యోగి ఆదిత్యనాథ్

బెస్ట్ యాక్టర్ ఇన్ కామెడిక్ రోల్ : బీజేపీ ఢిల్లీ అధ్యక్ష్యుడు మనోజ్ తివారి
నామినీస్ : నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్

బెస్ట్ సపోర్టింగ్ రోల్ అవార్డు: అర్నబ్ గోస్వామి
బెస్ట్ యాక్టర్ ఇన్ డ్రమెటిక్ రోల్: అరవింద్ కేజ్రీవాల్‌

యా విభాగాల్లో వారికి ఆ అవార్డులు దక్కినట్లు కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఈ అవార్డులు అందరినీ కట్టుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో ఓటమితో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ తీరుపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.