Begin typing your search above and press return to search.

భార్య విషయంలో లాడెన్ కు ఆ డౌట్

By:  Tupaki Desk   |   3 March 2016 7:17 AM GMT
భార్య విషయంలో లాడెన్ కు ఆ డౌట్
X
ప్రపంచానికే పెద్దన్న అయిన అమెరికాకు చెమటలు పట్టించిన అల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. తాజాగా అమెరికా విడుదల చేసిన కొన్ని రహస్య పత్రాల్లో ఈ విషయం బయటపడింది. లాడెన్ కు తన భార్య విషయంలో ఒక అనుమానం ఉండేదట. ఆమె పంటి సమస్యతో విపరీతంగా బాధ పడితే.. దానికి సర్జరీ చేయించారు. దీనికి ఒక ఇరాన్ వైద్యుడు ఆమెకు వైద్యం చేశాడు.

అయితే.. ఆ సర్జరీ సమయంలో సదరు డాక్టర్ తన భార్య పంటి కింద ట్రాకింగ్ డివైజ్ పెట్టాడేమో అన్నది లాడెన్ సందేహం. ఇదే విషయాన్ని అబు అబ్దుల్లా అనే మారుపేరుతో తన ఆఫ్తులకు ఒక లేఖ రాశాడు. ఇందులో తన భార్య పంటి కింద గోధుమ రంగులో సేమియా మాదిరి ఉన్న దాన్ని అమర్చారని.. అదేమైనా ట్రాకింగ్ పరికరమా? అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తూ లేఖ రాశాడు. ఆ ఉత్తరాన్ని చదివిన వెంటనే కాల్చేయాలని కోరాడు కూడా. తన ఉగ్రవాద కార్యకలాపాలతో ప్రపంచాన్ని వణికించిన లాడెన్.. తానెంత భయాందోళనల మధ్య కాలం గడిపాడో ఈ లేఖ చెప్పకనే చెబుతుంది. ​