Begin typing your search above and press return to search.

కోతలకు సిద్ధమౌతోన్న 73% కంపెనీలు ..!

By:  Tupaki Desk   |   15 May 2020 12:15 PM IST
కోతలకు సిద్ధమౌతోన్న  73% కంపెనీలు ..!
X
ఈ మహమ్మారిని అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు అనేకమంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి రాబోతుందట. ఈ లాక్ డౌన్ అనేక రంగాలపై తీవ్రమైన ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. దీనితో భారత వ్యవస్థీకృత ప్రైవేటు రంగ సంస్థలు ఉద్యోగాన్ని తొలగించేందుకు వేతనాల్లో కోత విధించే ఎందుకు సిద్ధమవుతున్నారని ఓ సర్వే తెలిపింది. దాదాపు 68 శాతం సంస్థలు ఈ దిశగా ఆలోచిస్తున్నాం అని వెల్లడించింది. ఈ మహమ్మారి ముప్పుతో అమలు చేసిన ఆర్థిక కార్యకలాపాల పై తీవ్ర ప్రభావం చూపించడమే దీనికి కారణం అని తెలిపింది.

మై హైరింగ్ క్లబ్ డాట్ కామ్ ..సర్కారీ నౌకరి.ఇన్ఫో సంస్థలు సంయుక్తంగా మే 1 నుంచి 10వ తేదీ వరకు ఈ సర్వే చేపట్టగా .ఈ సర్వే లో దేశవ్యాప్తంగా 25 నగరాల్లో 11 రంగాలకు చెందిన 1124 కంపెనీలూ పాల్గొన్నాయి. ఈ సర్వే ఫలితాలను బట్టి ..దాదాపు 70 శాతం కంపెనీలు ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించేందుకు సిద్ధమవుతున్నారట. 57% యజమానులు తాత్కాలికంగా ఉద్యోగాలు తీసేస్తామని, 21% శాతం మంది రెండేళ్ల పాటు శాశ్వతంగా ఉద్యోగాలు తీసేస్తామని వెల్లడించాయి. అయితే 32 శాతం కంపెనీలు వేతనాలు, ఉద్యోగాల్లో కోతలు విధించడం లేదని వెల్లడించాయి.

ఈ మహమ్మారి వల్ల అన్ని పరిశ్రమలు బాదను అనుభవిస్తున్నాయి. దీనితో ప్రతి స్థాయిలో కోతల రూపంలో అది వ్యక్తమవుతుంది. ఈ తాత్కాలిక సంక్షోభం నుంచి కంపెనీలు కొత్త ఉద్యోగాల సృష్టి మొదలు అవుతుంది అని మై హైరింగ్ క్లబ్ డాట్ కామ్, సర్కారీ నౌకరి సీఈవో రాజేష్ కుమార్ తెలిపారు. ఈ లాక్ డౌన్ సమయంలో వైమానిక, ఆతిధ్య, రవాణా ,ఎఫ్.ఎన్.సి.జి ..ఆటో మొబైల్ తయారీ రంగాలు ఎక్కువ ప్రభావం చెందాయని, ఈ రంగాలు కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతుందని తెలిపారు.