Begin typing your search above and press return to search.
కరోనా వేళ.. గంటలో 560కి.మీ. ప్రయాణించి ప్రాణాల్ని నిలిపారు
By: Tupaki Desk | 17 Aug 2020 12:20 PM ISTగంట సమయం.. ఎంత దూరం ప్రయాణించగలం? ఎవరెన్ని లెక్కలు వేసినా.. వంద కిలోమీటర్లకు మించి చెప్పలేరు. కానీ.. ఒక ప్రాణాన్ని కాపాడటం కోసం 560కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా చేసిన వైనమిది. కరోనా వేళలో.. రిస్కు తీసుకొని ఒక నిండు ప్రాణాన్ని నిలిపిన ఉదంతం ఇప్పుడు అందరి చేత అభినందనలు తెలిపేలా చేస్తోంది. హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి ఊపిరితిత్తుల సమస్యతో బాధ పడుతున్నాడు.
సికింద్రాబాద్ లోని కిమ్స్ హార్ట్ అండ్ లంగ్స్ ట్రాన్స్ ఫ్లాంట్ ఇన్ స్టిట్యూట్ లో చికిత్స పొందుతున్నారు. అవయువ దానం కోసం జీవన్ దాన్ ఫౌండేషన్ లో పేరు నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఫూణెలోని ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఆయన అవయువాలు దానం చేసేందుకు బంధవులు ముందుకు వచ్చారు. అదే సమయంలో మరణించిన వ్యక్తికి పరీక్ష చేయగా.. కరోనా నెగిటివ్ రావటంతో ఆయన ఊపిరితిత్తుల్ని సేకరించారు.
వాటిని భద్రపర్చిన ప్రత్యేక పెట్టెను ప్రత్యేక విమానం ద్వారా బేగంపేటకు చేర్చారు. అక్కడ నుంచి కిమ్స్ కు గ్రీన్ చానల్ ద్వారా తరలించారు. ఇందుకోసం 560కి.మీ. దూరాన్ని కేవలం గంట వ్యవధిలో తరలించినట్లుగా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఒక ప్రాణాన్ని నిలపటం కోసం ఫూణె.. హైదరాబాద్ మహానగర పోలీసులు సంయుక్తంగా సహకారం అందించటంతో సకాలంలో ఆవయువదానం సక్సెస్ అయ్యినట్లు చెబుతున్నారు. కరోనా లాంటి వేళలో.. ఒక ప్రాణాన్ని నిలిపేందుకు పడిన తపన అందరి అభినందనల్ని అందుకుంటోంది.