Begin typing your search above and press return to search.

రాఫెల్ స్కాంపై విచారణకు ఆదేశం.. ఏం తేలనుంది?

By:  Tupaki Desk   |   3 July 2021 11:30 PM GMT
రాఫెల్ స్కాంపై విచారణకు ఆదేశం.. ఏం తేలనుంది?
X
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాగానే మొదట వినిపించిన కుంభకోణం ఏదైనా ఉందంటే అది ‘రాఫెల్ యుద్ధ విమానాల’ కుంభకోణమే. ఇందులో భారీ స్కాం జరిగిందని ప్రతిపక్ష కాంగ్రెస్, సహా రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఇక భారత్ కు రాఫెల్ యుద్ధ విమానాలు అమ్మిన ఫ్రాన్స్ దేశంలో దీనికోసం పెద్ద ఎత్తున ముడుపులు అందాయని పత్రికల్లో వార్తలు వచ్చాయి. అక్కడ కూడా పెద్ద దుమారమే రేగింది.

అయితే సుప్రీంకోర్టులో రాఫెల్ యుద్ధ విమానాలపై విచారణ జరిగినా వర్కవుట్ కాలేదు. రాఫెల్ లో అసలు అవినీతే జరగలేదని మోడీ ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. విచారణ అవసరం లేదని వాదించింది. అయితే ఇలాంటి సమయంలో హఠాత్తుగా విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. కానీ భారత్ లోకాదు.. ఫ్రాన్స్ దేశంలో.. ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైంది.

రాఫెల్ స్కాంపై ఈ యుద్ధ విమానాలు అమ్మిన ఫ్రాన్స్ దేశంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఫ్రాన్స్ నుంచి భారత్ ‘రాఫెల్ ’ యుద్ధ విమానాల కొనుగోలు వెనుక భారీ స్కాం ఉందని ఆరోపనలు రావడంతో విచారణకు ఆదేశించారు. ఫ్రాన్స్ లోనూ లంచాలు చేతులు మారాయని ఆరోపణలున్నాయి.

ఫ్రాన్స్ లో తాజా పరిణామాల నేపథ్యంలో భారతదేశంలో రాజకీయ పరిస్థితులు వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాదాస్పద రఫేల్ డీల్ పై స్వతంత్ర్య విచారణ జరపాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది.

ఫ్రెంచ్ సంస్థ డసో ఏవియేషన్ భారతదేశంతో చేసుకున్న రఫేల్ ఒప్పందంపై విచారణ జరిపేందుకు ఫ్రాన్స్ కొత్తగా ఓ జడ్జిని నియమించిందని ఫ్రాన్స్ నేషనల్ ఫైనాన్షియల్ ప్రాసిక్యూటర్ కార్యాలయం (పీఎస్ఎఫ్) శుక్రవారం తెలిపింది.

రఫేల్ డీల్ లో అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీనిపై పరిశోధన చేసేందుకు తొలుత ఫ్రాన్స్ ప్రభుత్వం నిరాకరించింది. అయితే ఫ్రెంచ్ పరిశోధనాత్మక వెబ్ సైట్ ‘మీడియా పార్ట్ దీనిపై దర్యాప్తు చేసి ఈ డీల్ లో ఉన్న లోటుపాట్లను పీఎస్ఎఫ్ దాచిపెట్టిందని ఆరోపించింది. దీంతో ఇక ఫ్రాన్స్ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది.