Begin typing your search above and press return to search.

ఆర్డర్ క్యాన్సిల్... యువతిపై జొమాటో బాయ్ దాడి..!

By:  Tupaki Desk   |   11 March 2021 2:30 AM GMT
ఆర్డర్ క్యాన్సిల్... యువతిపై జొమాటో బాయ్ దాడి..!
X
జొమాటో .. ప్రస్తుతం ఈ పేరు దేశంలో చాలా ఫెమస్. ఫుడ్ డెలివరీ సంస్థల్లో జొమాటో కి ఉన్న క్రేజ్ వేరే లెవెల్ అని చెప్పాలి. ఈ జొమాటో యాప్ లో ఇలా ఫుడ్ బుక్ చేయగానే అలా మన ఇంటి గేట్ ముందుకి పార్సిల్ వస్తుంది. అయితే , అప్పుడప్పుడు ఈ జొమాటో కొన్ని వివాదాల్లో చిక్కుకుంటుంది. తాజాగా మరో వివాదం లో చిక్కింది. తాజాగా జొమాటో డెలివరీ బాయ్ ఒక మహిళపై దాడికి పాల్పడ్డాడు. స్వల్ప వివాదంతో ఆమె రక్తమెచ్చేలా అనుచితంగా దాడిచేశాడు.

దీనితో ఆమె తన అనుభవాన్ని ఇన్‌ స్టాలో షేర్‌ చేశారు. బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ హితేషా చంద్రానీ నెత్తురోడుతున్న తన ముఖంతో ఉన్న వీడియోను అప్‌ లోడ్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్‌ లో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే .. బెంగళూరుకు చెందిన బ్యూటీ ఇన్ ఫ్లుయెన్సర్ హితేషా చంద్రానీ ప్రముఖ ఫుడ్ డెలీవరీ సంస్థ జొమాటోలో మార్చి 9న మధ్యాహ్నం 3.30 గంటలకు ఆర్డర్ చేసింది.

ఈ ఆర్డర్ సాయంత్రం 4.30 గంటలకు డెలివరీ చేయాల్సి ఉంది. అయితే ఆర్డర్ సమయానికి రాలేదు. ఆర్డర్ రావడంలో ఆలస్యం కావడంతో హితేషా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడి తన ఆర్డర్ క్యాన్సిల్ చేయాలని కోరింది. ఇంతలోనే డెలివరీ బాయ్ ఆర్డర్ తీసుకొచ్చాడు. ఈక్రమంలో డెలివరీ బాయ్ కామరాజ్ హితేషాతో ఘర్షణకు దిగాడు. బలవంతంగా ఇంట్లోకి వచ్చి హితేషాపై పిడిగుద్దులు గుద్దాడు. తర్వాత ఆర్డర్ తీసుకొని పారిపోయాడు. రక్తమోడిన తన ముఖంతో హితేషా వీడియోను రికార్డ్ చేసి పోస్ట్ చేసింది. జొమాటో సేవలు సురక్షితమేనా అని, తనకు మద్దతుగా నిలవాలని కన్నీళ్లు పెట్టుకుంది.