Begin typing your search above and press return to search.
అప్పుడే వైసీపీ ఎంఎల్ఏలపై వ్యతిరేకతా ?
By: Tupaki Desk | 19 Oct 2021 11:00 PM ISTఅధికార వైసీపీ ఎంఎల్ఏలపై అప్పుడే జనాల్లో వ్యతిరేకత మొదలైపోయిందా ? వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్ళల్లోనే అధికార పార్టీ ఎంఎల్ఏలపై వ్యతిరేకత మొదలవ్వటం గమనార్హం. ఐఏఎన్ఎస్-సీ ఓటర్ సంస్ధలు అధికారపార్టీ ఎంఎల్ఏలపై దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించాయి. ఇందులో భాగంగానే ఏపిలో వైసీపీ ఎంఎల్ఏలపై నిర్వహించిన సర్వేలో 28.5 శాతం జనాల్లో వ్యతిరేకత ఉన్నట్లు స్పష్టమైంది.
ఎంఎల్ఏల పనితీరుపై సర్వే నిర్వహించినా అసెంబ్లీలో వైసీపీ ఎంఎల్ఏల షేరే ఎక్కువ కాబట్టి సహజంగానే అధికారపార్టీ ఎంఎల్ఏలపైనే దృష్టిపెట్టారు. అలాగే గోవా లోని అధికారపార్టీ ఎంఎల్ఏలపై 24.3 శాతం జనాల్లో వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విధంగా తెలంగాణాలోని టీఆర్ఎస్ ఎంఎల్ఏలపైన 23.5 శాతం మోస్ట్ యాంగ్రీ అని అర్ధమైపోయింది.
ఇక కేరళలోని ఎంఎల్ఏలపైన కూడా జనాల్లో 6.8 శాతం జనాల్లో వ్యతిరేకతుందట. గుజరాత్ ఎంఎల్ఏలపై 7.4 శాతం, మహారాష్ట్ర ఎంఎల్ఏలపై 7.9 శాతం వ్యతిరేకత ఉన్నట్లు బయటపడింది. జనాల్లో మోస్ట్ యాంగ్రీ 20 శాతం దాటిన రాష్ట్రాల్లో ఏపి, గోవా, తెలంగాణా రాష్ట్రాలున్నట్లే అత్యంత తక్కువ వ్యతిరేకత ఎదుర్కొంటున్న రాష్ట్రాల జాబితాలో కేరళ, గుజరాత్, మహారాష్ట్ర ఉన్నట్లు స్పష్టమైంది.
సర్వే ఎప్పుడు చేశారు ? ఎంతమందిపై చేశారు అనే వివరాలేవీ సర్వే ఫలితాల్లో కనబడలేదు. అయినా సర్వే జరిగిందని చెప్పారు కాబట్టి సహజంగానే జనాల్లో తమ ఎంఎల్ఏల పనితీరుపై కుతూహలం ఉండటం సహజం. ఎప్పుడైతే సర్వే ఫలితాలు వెలువడ్డాయో వెంటనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, వాటి సోషల్ మీడియాలో ట్రోలింగ్ వ్యతిరేకత మొదలవ్వటం గమనార్హం.