Begin typing your search above and press return to search.
కర్ణాటక మాదిరే మరో సీఎం దిగిపోనున్నారా?
By: Tupaki Desk | 21 Aug 2019 7:20 AM GMTయావత్ దేశం మొత్తం బీజేపీ.. దాని మిత్రపక్షాలు తప్పించి మరే పార్టీ ఉండకూడదన్న పట్టుదలతో ఉన్నారు కమలనాథులు. తమకు నేరుగా కుదరకపోతే.. మిత్రులతో అయినా సరే అధికారాన్ని పంచుకునేందుకు రెఢీ అవుతున్నారు. దీనికి తగ్గట్లే పావుతు కదుపుతున్న బీజేపీ.. తాజాగా మరో బుల్లి రాష్ట్రం మీద గురి పెట్టిందా? అంటే అవునన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇటీవల సదరు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల్ని చూస్తే.. రానున్న కొద్ది రోజుల్లోనే కర్ణాటకలో మాదిరి బీజేపీ సమర్పించు దాని మిత్రపక్షం చేతిలో పవర్ ఉండటం ఖాయమని చెబుతున్నారు.
తమిళనాడుకు అనుకొని ఉంటూ.. కేంద్రపాలిత ప్రాంతంగా సుపరిచితమైన పుదుచ్చేరిలో రాజకీయ పరిణామాలు నాటకీయంగా మారిపోతున్నాయి. అక్కడ ముఖ్యమంత్రి నారాయణస్వామిని దించేసే దిశగా పావులు కదులుతున్నాయి. దీని వెనుక కమలనాథులు ఉన్నారన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవల చోటు చేసుకున్న మార్పుల నేపథ్యంలో పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలన్నట్లుగా బీజేపీ వ్యూహకర్తల ఆలోచనగా ఉందని చెప్పాలి.
పుదుచ్చేరిలో గడిచిన మూడేళ్లుగా కాంగ్రెస్ -డీఎంకే సంకీర్ణ ప్రభుత్వం పవర్లో ఉంది. ముఖ్యమంత్రిగా నారాయణస్వామి వ్యవహరిస్తుంటే.. స్పీకర్ గా వైద్యలింగం ఉన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన వైద్యలింగం.. ఎన్నికల్లో గెలుపొందటంతో ఆ సీటు ఖాళీ అయ్యింది. ఇప్పుడా స్థానంలో శివకొళుందును నియమించారు.
స్పీకర్ గా వ్యవహరించే వారు.. నిష్పక్షపాతంగా ఉండాలే కానీ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండకూదన్న నినాదంతో రంగస్వామి.. అన్నాడీఎంకే ఫ్లోర్ లీడర్ అన్బళగన్ సహా ఎన్ ఆర్ కాంగ్రెస్ నేతలు కలిసి స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానాన్ని అసెంబ్లీ కార్యదర్శికి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో స్పీకర్ పాల్గొంటున్నారని.. మధ్యవర్తిగా ఉండాల్సిన ఆయన కాంగ్రెస్ సభ్యుడిగా ఉండటాన్ని ప్రశ్నించారు.
స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం తెర మీదకు రావటంతో పుదుచ్చేరి అధికారపక్షం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కర్ణాటకలో మాదిరి పుదుచ్చేరిలోనూ బీజేపీ వ్యూహకర్తలు కొత్త ప్లాన్ ను సిద్ధం చేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రంగస్వామిని ముఖ్యమంత్రిని చేయటం ద్వారా.. బుల్లి రాష్ట్రం బీజేపీ పరమవుతుందని.. దక్షిణాదిన నెమ్మది నెమ్మదిగా బీజేపీ చట్రంలోకి ఒక్కొక్క రాష్ట్రాన్ని చేర్చాలన్న తమ లక్ష్యానికి దగ్గరగా చేరుకునేందుకు పుదుచ్చేరిని ఎంపిక చేసుకున్నట్లుగా చెబుతున్నారు. రానున్నరోజుల్లో చోటు చేసుకునే పరిణామాలు ఈ వాదనలో నిజమెంతన్న విషయాన్ని చెప్పేయనున్నట్లుగా చెప్పక తప్పదు.