Begin typing your search above and press return to search.
సభకు చంద్ర బాబును వాడితే అంతే సంగతులు !
By: Tupaki Desk | 18 Dec 2021 10:54 AM ISTఏపీలో రాజకీయం మారుతోంది. అజెండా కూడా సెట్ అవుతోంది. సాధారణంగా రాజకీయ పార్టీలు కలసిపోవడానికి భావసారూప్యత అన్న పదం వాడుతారు. అలాంటి భావ సారూప్యతను అమరావతి రాజధాని రూపంలో దొరికిందా అన్నదే చర్చ. ఏపీలో ఒక్క వైసీపీ తప్ప అన్ని పార్టీలు అమరావతి రాజధాని ఒక్కటే ఉండాలని గట్టిగా మద్దతు ఇస్తున్నారు. అదే సమయంలో కలసికట్టుగా ఈ విషయంలో ముందుకు సాగాలని తీర్మానిస్తున్నారు.
దీంతో ఏపీలో కొత్త రాజకీయ సమీకరణలకు వేదిక అమరావతి రాజధాని అయిందా అన్న చర్చ మొదలైంది. అమరావతి ఇష్యూని వచ్చే ఎన్నికల్లో కూడా ప్రధాంగా తీసుకుపోవాలని ఇప్పటికైతే టీడీపీ నిర్ణయించింది. ఇక అన్ని పార్టీలు కూడా అదే అజెండాగా ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుపతిలో జరిగిన రైతుల సభలో వైసీపీ తప్ప అన్ని పార్టీలు కనిపించాయి. కాంగ్రెస్ వామపక్షాలు బీజేపీ, జనసేన కలసి ఒకే వేదిక పంచుకోవడం అంటే అది రికార్డుగానే చూడాలి.
మరో వైపు చూస్తే సీపీఎం ఈ సభకు తాము దూరమని చెప్పినా అమరావతి ఏకైక రాజధానికి తమ మద్దతు ఉంటుందని చెప్పేసింది. అంటే మొత్తం అంతా అమరావతి రాజధాని విషయంలో ఒక్క మాట మీదనే ఉన్నారని అర్ధమవుతోంది. అయితే ఇది కేవలం అమరావతి ఉద్యమానికే పరిమితమా లేక ఫ్యూచర్ లో రాజకీయాల్లో కూడా ఈ ఐక్యత కనిపిస్తుందా అన్నది కూడా ఆలోచించాలి
ఇప్పటిదాకా చూసుకుంటే ఏపీలో బాహాటంగా ఏ రెండు పార్టీల మధ్య పొత్తు అన్నది లేదు. బీజేపీ జనసేన మాత్రమే కూటమి కట్టాయి. కానీ రానున్న రోజుల్లో పరిణామాలు మారేందుకు అమరావతి రైతుల సభ ఊతమిచ్చింది అంటున్నారు. ఈ సభ ద్వారా వైసీపీకి రాజకీయంగా గట్టి సవాల్ ని విపక్షాలు విసిరారని భావించవచ్చు అంటున్నారు.
జగన్ ఒక వైపు ఉంటే ఏపీలో మొత్తానికి మొత్తం రాజకీయం మరో వైపు ఉండడం నిజంగా విశేష పరిణామంగానే చూడాలి. జగన్ అధికారంలో ఉన్నారు. 151 సీట్లతో బలంగా కనిపిస్తున్నారు. 2024 నాటికి రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయో ఎవరూ చెప్పలేరు కానీ జగన్ ఈ రోజుకు స్ట్రాంగ్ గానే కనిపిస్తున్నారు. దాంతో ఆయన్ని గద్దె దించాలంటే అంతా ఒక్కటి కావాలన్నది విపక్ష నినాదంగా ఉంది.
తిరుపతి సభ అమరావతి రైతులకు మద్దతుగా జరిగిన దాని వెనక ఉన్న రాజకీయ ఉద్దేశ్యాలను ఎవరూ కొట్టి పారేయలేరు. అయితే ఇపుడు వేదిక మీద కనిపించినట్లుగా కలగూరగంపలా అన్ని పార్టీలు కలసి మహా కూటమిగా ముందుకు వస్తారా అంటే చెప్పడం కష్టం. అది జరగడం కూడం కష్టమే. ఎందుకంటే ఎన్నికల వేళకు కాంగ్రెస్ బీజేపీ ఒకే కూటమిలో ఉండవు, అలాగే వామపక్షాలు బీజేపీ కలిసే సీన్ లేదు. కానీ మెజారిటీ పార్టీలు ఒక కూటమి కట్టేందుకు జగన్ని నిలువరించేందుకు తిరుపతి రైతుల సభ ఉపయోగపడుతుంది అన్న అంచనాలు అయితే ఉన్నాయి.
మొత్తానికి జగన్ కి వ్యతిరేకంగా బలామిన ఆల్టర్నేషన్ ని తయారు చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారనే అనుకోవాలి. అయితే రేపటి రోజున జగన్ కి యాంటీగా బలమైన కూటమి రాజకీయంగా చాలెంజి చేస్తే దాన్ని తట్టుకుని మళ్ళీ అధికారంలోకి వచ్చే సీన్ ఎంతవరకూ వైసీపీకి ఉంది అన్నదే ఇక్కడ చర్చ. మరి దానికి ఇపుడు సమాధానం వెంటనే దొరకరు, 2024 వరకూ వెయిట్ చేయాల్సిందే.