Begin typing your search above and press return to search.
విపక్ష పార్టీ రంగుల్ని అక్కడి టాయిలెట్లకు వేశారట
By: Tupaki Desk | 30 Oct 2020 10:30 AM ISTఇటీవల కాలంలో యూపీ తరచూ వార్తల్లోకి వస్తోంది. గతంలో యోగి సర్కరు ఇమేజ్ పెంచే వార్తలు కనిపిస్తే.. ఇప్పుడు అందుకు భిన్నంగా వరుస పెట్టి వివాదాలతో కూడిన వార్తలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా బయటకు వచ్చిన తాజా ఉదంతం కూడా ఈ కోవకు చెందిందే. గోరఖ్ పూర్ రైల్వే ఆసుపత్రికి ఎదురుగా ఉన్న టాయిలెట్లకు వేసిన రంగులు ఇప్పుడక్కడ రాజకీయ రగడకు కారణంగా మారింది. టాయిలెట్లకు వేసిన రంగు.. ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ జెండాలోని రంగులు కావటం వివాదంగా మారింది.
యూపీ ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్ వాదీ జెండాలోని ఎరుపు.. ఆకుపచ్చ రంగులు ప్రముఖంగా కనిపిస్తాయి. సరిగ్గా ఇవే రంగులతో గోరఖ్ పూర్ లోని టాయిలెట్లకు వేసిన రంగులు ఉండటంపై సమాజ్ వాదీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారంపై సమాజ్ వాదీ పార్టీ సీరియస్ గా స్పందించింది. ఇలాంటి చర్యలు రాజ్యాంగానికే అవమానంగా అభివర్ణించింది.
ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని సమాజ్ వాదీ డిమాండ్ చేసింది. బీజేపీవారి మైండ్ సెట్ కు టాయిలెట్ల రంగుల వ్యవహారం ఒక చక్కటి ఉదాహరణగా సమాజ్ వాదీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ ఫైర్ అయ్యారు. టాయిలెట్లకు వేసిన రంగు వివాదాస్పదం కావటంతో రైల్వే శాఖ స్పందించింది. వెంటనే.. ఆ రంగుల్ని మార్చేసింది. అయినప్పటికీ.. తమను అవమానించారన్న ఆగ్రహాన్ని సమాజ్ వాదీ వ్యక్తం చేస్తోంది. పలు ప్రశ్నల్ని సంధిస్తోంది.
యోగి సర్కారుకు ఈ వ్యవహారం ఒక తలనొప్పిగా మారింది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు తమ వాదనను వినిపిస్తున్నారు. తమకు ఎలాంటి రాజకీయ ఎజెండాలు లేవని.. శుభ్రంగా ఉండటం కోసమే.. రంగులు వేశామే తప్పించి మరో ఆలోచన లేదంటున్నారు. ఒకవేళ వారి వాదనే నిజమనుకుంటే.. విపక్ష పార్టీకి చెందిన రంగుల్నే ఎందుకు వాడుతున్నట్లు? అన్న ప్రశ్నకు సమాధానం లభించని పరిస్థితి.