Begin typing your search above and press return to search.

ఖర్చులు తగ్గించకపోతే బాబుకు కష్టమే

By:  Tupaki Desk   |   13 Aug 2015 11:50 AM IST
ఖర్చులు తగ్గించకపోతే బాబుకు కష్టమే
X
ఏపీ సర్కారు పాలన విషయంలోనూ.. ప్రభుత్వ పని తీరు గురించి ఎవరూ పెద్దగా పట్టించుకున్నా పట్టించుకోకున్నా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ఖర్చులు మాత్రం తరచూ చర్చనీయాంశాలుగా మారుతున్నాయి.

విదేశీ పర్యటనల సమయంలోనే కాదు.. ఢిల్లీకి వెళ్లాలన్న ప్రత్యేక విమానాల్ని ఆయన ఏర్పాటు చేసుకోవటంపై విమర్శలు వెల్లువెత్తటం కొత్తేం కాదు. ఒక్క విమాన ఖర్చులు మాత్రమే కాదు.. తన ఆఫీసు కోసం.. ఇంటి కోసం కోట్లాది రూపాయిలు ఖర్చు చేయటంపై విపక్షాలు విరుచుకుపడటం తెలిసిందే.

తాజాగా.. అలా విమర్శలు చేసిన జాబితాలో లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ కూడా చేరారు. ఓ పక్క ఏపీ అప్పుల్లో ఉందని చెబుతూనే.. మరోవైపు.. స్పెషల్ ఫ్లైట్లలో ప్రయాణాలు చేయటం ఏమిటంటూ విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు ఆచితూచి ఖర్చులు చేయాల్సింది పోయి.. ఆడంబరాలకు పోవటం ఏ మాత్రం సరికాదన్న వాదనను వినిపించారు.

తన ఖర్చులపై విపక్ష నేతలు తరచూ విమర్శలు చేయటాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిగణలోకి తీసుకుంటారో లేదో..? ఆర్థిక పరిస్థితి బాగోలేదనప్పుడు అందుకు తగినట్లుగా ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించని పక్షంలో సర్కారుపై విమర్శల వేడి పెరగటంతో పాటు.. ప్రజా వ్యతిరేకత పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.