Begin typing your search above and press return to search.
అప్పుడే ప్రతిపక్షాల్లో చీలికలా ?
By: Tupaki Desk | 30 Jun 2023 12:30 AM ISTప్రతిపక్షాల ఐక్యత నేతిబీరకాయలో నెయ్యిలాంటిదే అన్న సామెతలాగ తయారైంది ప్రతిపక్షాల ఐక్యతా రాగం. నరేంద్రమోడీ ప్రతిపాదిస్తున్న ఉమ్మడి పౌరస్మృతి(కామన్ సివిల్ కోడ్) విషయంలోనే ప్రతిపక్షాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మోడీ ప్రతిపాదనను కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకిస్తుంటే ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సూత్రప్రాయంగా మద్దతు తెలుపుతున్నారు. దేశమంతా ఒకే విధమైన సివిల్ కోడ్ ఉండాలని బీజేపీ ఎప్పటినుండో చెబుతోంది. అయితే అందుకు అవసరమైన ప్రతిపాదనలు మాత్రం ఏమీచేయలేదు.
ఇపుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా అందుకనే తేనెతుట్టె లాంటి కామన్ సివిల్ కోడ్ అనే అంశాన్ని ఎత్తుకుంది. కావాలనే మోడీ పదేపదే కామన్ సివిల్ కోడ్ ను పదేపదే ప్రస్తావిస్తున్నారు. దీనివల్ల దేశంలోని జనాల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వటం ఖాయం.
పనిలోపనిగా రాజకీయపార్టీలు కూడా తమ రాష్ట్రాల్లోని మెజారిటి జనాల అభిప్రాయాలకు అనుగుణంగానే విడిపోవటం తథ్యం. ఈ విషయమై అధ్యయనం చేసిన తర్వాతే మోడీ కామన్ సివిల్ కోడ్ అంశాన్ని ఎన్నికల్లో ప్రస్తావించారు.
మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఇదే అంశంపై చాలాసేపు మాట్లాడారు. దేశంలోని జనాలకు రెండు రకాల సివిల్ కోడ్లు ఉండాలా అని మోడీ గట్టిగా ప్రశ్నించారు. మామూలుగా జనాలెవరు ఇలాంటి విధానాలను అంగీకరించరు. ఇప్పటికే ముస్లింలకు ఉన్న కొన్ని ప్రత్యేకమైన చట్టాలపై మిగిలిన జనాలు మండిపోతున్నారు.
వివాహాలు, విడాకులు, రిజర్వేషన్లు లాంటి అనేక అంశాలపై మెజారిటి హిందువులు ఎప్పటినుండో ముస్లింలపై గుర్రుగా ఉన్నారు. వివాహాలు, విడాకులపై హిందువులకు లేని వెసులుబాటు ముస్లింలకు మాత్రం ఎందుకని నిలదీస్తున్నారు. అందరికీ ఒకటే విధమైన నిబంధనలు ఉండాలనే డిమాండ్లు కూడా పెరిగిపోతున్నాయి.
స్కూళ్ళల్లో యూనిఫారంలు పెడితే హిందువులు డ్రస్ కోడ్ పాటించాలి కానీ మతపరమైన దుస్తుల పేరుతో ముస్లింలు యూనిఫారంలను ధరించకపోయినా అడగటంలేదు. అదేమంటే తమ మతాచారాల ప్రకారమే తాము నడుచుంటామంటున్నారనే గోల పెరిగిపోతోంది. కర్నాటకలో మొదలైన హిజాబ్ వివాదం ఇలాంటిదే.
ఇలాంటి అనేకమైన చట్టాలను రద్దుచేసి కామన్ సివిల్ కోడ్ ను తీసుకురావాలని మోడీ ప్రతిపాదించారు. మోడీ ప్రతిపాదన ఫక్తు రాజకీయ లబ్దికోసమే అని అర్ధమైపోతోంది. మరిదీన్ని ప్రతిపక్షాలు ఏ విధంగా తిప్పికొడతాయో చూడాలి.