Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ స్పీక్స్ : ఆ ఇద్ద‌రు నేత‌లూ స్క్రిప్ట్ రీడ‌ర్సా ? వామ్మో !

By:  Tupaki Desk   |   6 May 2022 11:30 PM GMT
టీఆర్ఎస్ స్పీక్స్ : ఆ ఇద్ద‌రు నేత‌లూ స్క్రిప్ట్ రీడ‌ర్సా ? వామ్మో !
X
ఓ స‌మ‌యంలో కేసీఆర్ కూడా కొన్ని అనుచిత వ్యాఖ్య‌లే చేశారు. మ‌రి! ఆ రోజు స్క్రిప్ట్ ఎవ‌రు రాశారు? ఇంకా చెప్పాలంటే ఓ స‌మ‌యంలో కేటీఆర్ కూడా త‌ప్పుడు మాట‌లే అన్నారు. అప్పుడు స్క్రిప్ట్ ఎవ‌రు రాశారు ? ఆ మాట‌కు వ‌స్తే క‌విత‌క్క కూడా ఏవో కొన్ని అబ‌ద్ధ‌పు మాట‌ల‌ను హామీలుగా మార్చి తెలంగాణ గూటిలో చిల‌క ప‌లుకులు ప‌లికారు.. అవి ఎవ‌రు రాస్తే వెలుగులోకి వ‌చ్చాయి.. లోకం వినేలా అయ్యాయి. క‌నుక ఎవ‌రు ఎలా ఉన్నా కూడా నాయ‌కులంతా స్క్రిప్ట్ ను ఫాలో కావాలి. ఎవ‌రి స్క్రిప్ట్ ని ఒక‌రు కాదు.. ఒక‌రు స్క్రిప్ట్ ను మరొకరు రాసుకుని చ‌దువుకుంటే రాహుల్ గాంధీ కూడా బాగానే న‌చ్చుతాడు. బీజేపీ బాస్ జేపీ న‌డ్డా కూడా న‌చ్చుతాడు.

ఇవీ ఇవాళ తెలంగాణ పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో వినిపిస్తున్న మాట‌లు. హుందాత‌నం కోరుకుని మాట్లాడితే వేరు. ఆ విధంగా కాకుండా ఏం మాట్లాడినా అవ‌న్నీ స‌మ‌స్య‌ల‌కు కార‌కాలే ! ఎందుకు ఇదంతా అంటే తెలంగాణ రాష్ట్ర స‌మితిని ఇవాళ ఇద్ద‌రు నేత‌లు క‌ల‌వ‌రపాటుకు గురి చేస్తున్నారు. ఒక‌రు రాహుల్.. మ‌రో నేత జేపీ న‌డ్డా. నిన్న జేపీ న‌డ్డా వ‌చ్చి వెళ్లారు.

పాల‌మూరు కేంద్రంగా జేపీ న‌డ్డా స‌భ స‌క్సెస్ అయింది. ఆయ‌న‌కు తెలంగాణ ఆత్మ తెలియ‌దు. ఆత్మ ఘోష తెలియ‌దు అని టీఆర్ఎస్ అంటోంది. ఆత్మ తెలిసిన వాళ్లు యాద‌గిరి గుట్ట‌కు సంబంధించి ఘాట్ రోడ్ అలా ఎందుకు వేశారు. ప‌ద‌కొండు వేల కోట్ల‌ర రూపాయ‌లకు లెక్క‌లెందుకు చెప్ప‌లేదు ? అని అంటోంది విప‌క్ష కాషాయ మూక లేదా స‌మూహం. పోనీ ఇదిలా ఉంచితే ఇవాళ వ‌రంగ‌ల్ కేంద్రంగా రాహుల్ స‌భ పెట్టారు. రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ ..బీజేపీది తెలంగాణ గోస.. బీజేపీ భ‌రోసాఅయితే ఈయ‌న ఇందుకు భిన్నంగా పూర్తిగా రైతే రాజు అన్న నినాదంతో స‌భ నిర్వ‌హ‌ణ‌కు త‌ల పెట్టారు. ఇదే నేప‌థ్యంలో ఇది రాహుల్ సంఘ‌ర్ష‌ణ స‌భ అని క‌విత అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో రాహుల్ కూడా రాసిచ్చిన స్క్రిప్ట్ చ‌దువుతున్నార‌నే అంటున్నారు. అంటే రాహుల్ కు తెలంగాణ స‌మ‌స్య‌లు తెలియ‌వ‌ని ఎలా అనుకుంటారు.. అంటే తెలంగాణ ఆత్మ తెలిసిన క‌విత కానీ ఇత‌ర తెలంగాణ నాయ‌కులు రైతుల కోసం చేసిన ప‌నులు స‌ఫ‌లీకృతం అయ్యాయా అని ప్ర‌శ్నిస్తోంది టీ కాంగ్రెస్. అంటే రాజకీయాల్లో టీఆర్ఎస్ ఒక్క‌టే సొంత స్క్రిప్ట్ చ‌దువుతుంద‌ని తాము అనుకోవాలా ? అని మ‌రో ప్ర‌శ్న సంధిస్తోంది టీ కాంగ్రెస్. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ ప్ర‌తిప‌క్షాలు మాట్లాడితే చాలు తెలంగాణ రాష్ట్ర స‌మితి నోరేసుకుప‌డిపోవ‌డం త‌గ‌ద‌ని కూడా హిత‌వు చెబుతోంది.