Begin typing your search above and press return to search.

ఇక.. ఢిల్లీలో నాన్ స్టాప్ ఎంజాయ్ మెంట్

By:  Tupaki Desk   |   24 March 2016 5:00 AM GMT
ఇక.. ఢిల్లీలో నాన్ స్టాప్ ఎంజాయ్ మెంట్
X
దేశ రాజధాని ఢిల్లీ ఇక నిద్ర పోయే ఛాన్స్ లేదు. తాజాగా తీసుకోనున్న నిర్ణయంతో రాత్రి.. పగలు తేడా లేకుండా 24 గంటలూ వ్యాపారాలు చేసుకునే వెసులుబాటు లభించనుంది. రౌండ్ ద క్లాక్ నడుపుకునేలా రెస్టారెంట్లు.. బార్లకు అనుమతులు ఇవ్వాలన్న ఆలోచన​ చేస్తోంది ఢిల్లీ సర్కారు​. దీనిపై అధికార నిర్ణయం త్వరలోనే వెలువడుతుందని చెబుతున్నారు.

ఈ నిర్ణయం కానీ తీసుకుంటే.. నాన్ స్టాప్ వ్యాపారం దేశ రాజధానిలో షురూ అయినట్లే. షాపులు ఎక్కువసేపు తెరిచి ఉండటం ద్వారా నేరాలు తగ్గే వీలుందన్న భావనను ఢిల్లీ పర్యాటక శాఖ ​మంత్రి కపిల్ మిశ్రా అభిప్రాయపడటం గమనార్హం. తాజా నిర్ణయంలో భాగంగా ఢిల్లీలోని రెస్టారెంట్లు.. బార్లు​ ​24 గంటలు తెరిచే ఉండి.. కస్టమర్లకు సేవలందించేందు సిద్ధంగా ఉండనున్నాయి.

తాజా నిర్ణయానికి తగినట్లుగా చట్టంలో మార్పులు చేసేందుకు 2016-17 ఎక్సైజ్ విధానాన్ని రూపొందించనున్నారు. దీని అమలు అంశంపై ఇప్పటికే దుకాణదారులు.. రెస్టారెంట్ల యజమానులతో పాటు.. పోలీసులు.. కార్మిక మంత్రిత్వశాఖతో చర్చలు జరిపేందుకు సిద్ధం అవుతున్నారు. సో.. ఎప్పుడు కావాలంటే అప్పుడు తిని.. తాగేసే రోజు ఢిల్లీలో అట్టే దూరంలో లేదన్న మాట.